Movies' అశోకవ‌నంలో అర్జున్ క‌ళ్యాణం ' ట్రైల‌ర్‌తోనే బొమ్మ‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ కళొచ్చిందే...

‘ అశోకవ‌నంలో అర్జున్ క‌ళ్యాణం ‘ ట్రైల‌ర్‌తోనే బొమ్మ‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ కళొచ్చిందే ( వీడియో)

మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ చేసింది త‌క్కువ సినిమాలే అయినా యూత్‌లో.. మాస్‌లో మాంచి కిక్ ఇచ్చే హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విశ్వ‌క్ తాజాగా న‌టిస్తోన్న సినిమా అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం. ఈ రోజు ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్ ఓ సారి చూస్తే ఖ‌చ్చితంగా మ‌రో రెండు సార్లు అయినా చూసేలా ఉంది. ట్ర‌ల‌ర్‌లో మాస్ కా దాస్ అయిన విశ్వ‌క్‌ను ఫుల్ క్లాస్ కా దాస్ గా ప‌రిచ‌యం చేశారు.

33 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కాని తెలంగాణ‌లోని సూర్యాపేట కుర్రోడికి.. ఆంధ్ర‌లోని గోదార‌మ్మ‌యి ప‌సుపులేటి మాధ‌వితో పెళ్లి కుదురుతుంది. సూర్యాపేట మొత్తం ఒక్క‌టే టాపిక్‌.. మ‌న అల్లం అర్జున్ కుమార్ గాడికి 33 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కాలేదన్న‌దే ఆ టాపిక్‌. మొత్తానికి పెళ్లి కుద‌ర‌డంతో వీళ్లంతా పెళ్లి కూతురు ఇంటికి వెళ‌తారు. ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా క‌థ అంతా పెళ్లి చుట్టూ తిరుగుతుంద‌నే అనిపిస్తుంది.

రెండే వేర్వేరు ప్రాంతాలు.. వేర్వేరు కులాల‌కు చెందిన హీరో, హీరోయిన్ల‌కు పెళ్లి కుదురుతుంది. హీరోకు ముద్దు పెట్టాక కూడా ఏదో తేడా వ‌స్తుంది.. పెళ్లంటే ఇష్టం లేద‌ని హీరోయిన్ చెపుతుంది.. మ‌ధ్య‌లో హీరో తండ్రికి, హీరోయిన్ తండ్రికి గొడ‌వ మొద‌ల‌వుతుంది.. చివ‌ర‌కు ఈ పెళ్లి సుఖాంత‌మైందా ? ఆంధ్రా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి ఒక్క‌ట‌య్యారా ? లేదా ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

కావాల్సినంత రొమాన్స్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీ ఉంద‌ని ట్రైల‌ర్ చెప్పేసింది. విశ్వ‌క్ న‌ట‌న‌, డైలాగులు అదిరిపోయాయి. నాకు ఇప్పుడు 33 ఏళ్లు.. మ‌రో మూడేళ్లు పోతే 36 వ‌స్తాయి.. అప్పుడు పెళ్లి చేసుకుంటే అది క్రైమా.. జైళ్లో వేస్తారా ? అని త‌న తండ్రితో ఎమోష‌న‌ల్‌గా చెపుతున్నారు. సినిమా ట్రైల‌ర్ అయితే బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ‌తో క‌నిపిస్తోంది. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మే 6 వ‌ర‌కు ఆగాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news