సినిమా రంగంలో ఒకే లైన్‌తో ఉన్న కథలతో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ఒక సినిమాలో ఒక సీన్‌ను పోలిన సీన్లు మరో సినిమాలో ఉండడం సహజం. అలాగే ఇన్ని సినిమాలను చూస్తున్నప్పుడు.. చేస్తున్నప్పుడు కొన్ని సినిమాల కథలు కూడా ఒకేలా ఉంటూ ఉంటాయి. ఎంత పాత కథ తీసినా దానిని ప్రేక్షకులకు కనెక్ట్ చేసే ట్రీట్‌మెంట్ ఉంటే చాలు హిట్ కొట్టేయవచ్చు. మహేష్‌బాబు కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేసిన సినిమా ఒక్కడు.
సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై ఎంఎస్. రాజు నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మహేష్‌బాబు – భూమిక జంటగా ప్రకాష్‌రాజ్ విలన్‌గా నటించిన ఈ సినిమా 2003 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి 130 కేంద్రాల్లో 100 రోజులు ఆడడంతో ఎన్నో సంచలనాత్మక రికార్డులు తన పేరిట వేసుకుంది. ఈ సినిమాలో మెయిన్ థీమ్ కష్టాల్లో ఉన్న హీరోయిన్.. హీరోకు పరిచయం కావడం.. హీరోయిన్ తన లక్ష్యాలు అన్నీ పక్కన పెట్టేసి హీరోయిన్‌ను సేవ్ చేయడం.
ఈ సినిమా వచ్చాక బోయపాటి శ్రీను ( అప్పటకి ఇంకా డైరెక్టర్ కాలేదు) భద్ర కథ రెడీ చేసుకున్నాడు. ఈ సినిమాలో కూడా రవితేజ హీరోయిన్ మీరా జాస్మిన్‌ను సేవ్ చేస్తాడు. ఈ కథ ముందుగా బన్నీకి చెప్పాడు బోయపాటి. అప్పుడు బన్నీ దిల్ రాజు బ్యానర్లో ఆర్య చేస్తున్నాడు. ఈ కథ గురించి బన్నీ.. దిల్ రాజుతో చెప్పాడు. ఈ కథ విన్నాను… చాలా బాగుంది.. బట్ నేను చేస్తానో లేదో తెలియదు… మీరు ఓ సారి వినమని చెప్పాడట.
దిల్ రాజు కథ విన్నాక చాలా బాగుందని.. నువ్వ నాకు ఈ కథ హోల్డ్ చేసి పెట్టు.. ఆర్య తర్వాత చేద్దామని చెప్పాడట. అయితే ఈ కథ విన్న కొందరు సేమ్ ఒక్కడు ఫార్మాట్లోనే ఉందని బోయపాటితో పాటు దిల్ రాజును డిజప్పాయింట్ చేసేవాళ్లట. బోయపాటితో అయితే ఒక్కడుకు కాపీలా ఉందని అనేవారట. ఒకానొక దశలో ఆయన సైతం నిరాశలోకి వెళ్లిపోయారట. అయితే రాజు మాత్రం ఒక్కడు కథ వేరు.. భద్ర మాసివ్ లైన్ వేరు.. రెండు చోట్ల హీరోయిన్ కష్టాల్లో ఉంటే హీరో సేవ్ చేయడం అన్న లైన్ ఉన్నా.. రెండు కథలకు సంబంధం లేదని ముందు నుంచే నమ్మేవారట.
భద్రలో మాసివిజంతో పాటు ఎమోషన్‌ను క్యారీ చేస్తూ కథ చెప్పామని.. తాము అనుకున్న రిజల్ట్ వచ్చిందని రాజు చెప్పారు. అయితే ఇదే స్టోరీని ముందు బన్నీకి చెప్పాగా.. ఆ తర్వాత ప్రభాస్ దగ్గరకు వెళ్లగా.. ప్రభాస్ అప్పటికే వర్షం సినిమాలో బిజీ ఉన్నాడు. చివరకు అటూ ఇటూ తిరిగి అది రవితేజ దగ్గరకు వచ్చింది.