మామూలుగా అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికే మెగాస్టార్ చిరంజీవి – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా వచ్చి ఉండేది. ఎందుకంటే చిరు – పూరి సినిమా ఇప్పటది కాదు 20 ఏళ్ల క్రిందటి మాట.. పూరి ఇడియట్, అమ్మనాన్న తమిళ అమ్మాయి టైంలో వరుస హిట్లు కొట్టినప్పుడే చిరు – పూరి కాంబినేషన్ అన్న మాట బయటకు వచ్చింది. తర్వాత చిరు తనయుడు చెర్రీ ఫస్ట్ సినిమా చిరుతకు పూరీ డైరెక్టర్. ఆ వెంటనే చిరు రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో పూరి – చిరు సినిమా పదేళ్లు ఆలస్యం అయ్యింది.
ఇక చిరు రీ ఎంట్రీ సినిమాగా ముందు తెరమీదకు వచ్చిన ఆటోజానీ సినిమాకు పూరీయే దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే పూరి చెప్పిన సెకండాఫ్ చిరుకు నచ్చకపోవడంతో కొన్ని సిట్టింగ్‌ల తర్వాత ఇది పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత చిరు కోలీవుడ్ హిట్ మూవీ కత్తి రీమేక్ ఖైదీ నెంబర్ 150లో నటించాడు. ఆ తర్వాత పూరి వరుస ప్లాపులు ఇవ్వడంతో చిరును కలిసే ఛాన్స్ కూడా రాలేదు.
ఇక విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాడు. ఇటు చిరు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఎట్టకేలకు వెండితెరపై చిరు – పూరి కలిసి పనిచేయబోతున్నారు. అయితే పూరి దర్శకుడిగా కాదు.. చిరు సినిమాలో పూరి గెస్ట్ రోల్ చేస్తున్నారు. చిరు గాడ్ ఫాదర్ సినిమాలో పూరి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా గాడ్ ఫాదర్ సెట్లోకి పూరితో పాటు ఛార్మీ కూడా కలిసి వెళ్లింది. పూరితో తాను కలిసి నటిస్తోన్న విషయాన్ని చిరు బయట పెట్టారు. ఈ సందర్భంగా చిరు – పూరి – ఛార్మీ కలిసి ఉన్న స్టిల్స్ కూడా చిరు బయట పెట్టారు. అయితే పూరి – ఛార్మీ చేసిన పనితో ఈ సినిమాలో చిరు లుక్ ఏంటో బయటకు వచ్చేసింది. చిరు ఖైదీగా కనిపిస్తున్నారు. ఆ లుక్ తెలిసిపోయింది.
మొత్తానికి పూరి – ఛార్మీ చిరు సెట్లోకి అడుగు పెట్టి ఆయన లుక్ రివీల్ చేసి పడేశారు. ఇక మల్లూవుడ్ హిట్ సినిమా లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తోన్న గాడ్ ఫాదర్లో నయనతార హీరోయిన్. మోహనరాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పూరి జగన్నాథ్ జర్నలిస్టుగా కనిపిస్తున్నాడు.