కాలం మారిపోతోంది… ప్రేమ, పెళ్లి అనే పదానికి అర్థాలే మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రేమలు, పెళ్లిళ్లు అంటే జీవితాంతం కలిసి ఉండడం అన్నదే ఉండేది. ఇప్పుడు మూడు నెలల ప్రేమ.. ఆరు నెలల కాపురాలు.. యేడాది తిరక్కుండానే విడాకులు అయిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే వారం రోజులకే పెళ్లి చేసుకుని విడిపోతున్న దంపతులను కూడా ఎంతో మందిని చూస్తున్నాం. అయితే మారుతున్న పరిస్థితుల్లో ఓ సారి ప్రేమ పెళ్లిలో ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఏమోగాని సెలబ్రిటీలు ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఎన్ని సార్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకుని మోసపోయినా వెంటనే మరో ప్రేమ పెళ్లికి రెడీ అయిపోతున్నారు.
ఇక సినిమా రంగం అనేది గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ సెలబ్రిటీలు ప్రేమ ఫెయిల్ అయిన బాధను చాలా సింపుల్‌గా మర్చిపోతారు. పెళ్లయిన హీరోలు కూడా తమతో నటించే హీరోయిన్లపై మనసు పారేసు కుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొత్త ఎఫైర్లు కూడా పెట్టుకుంటారు. ఇక కొందరు హీరోలు అయితే పెళ్లయ్యి విడాకులు తీసుకున్న హీరోయిన్లను ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
రాధిక – శరత్ కుమార్ :
సీనియర్ హీరోయిన్ రాధికకు ముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ముందుగా దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడికి విడాకులు ఇచ్చేశాక.. లండన్‌కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లాడారు. ఓ పాప పుట్టాక అతడికి కూడా విడాకులు ఇచ్చేసి.. ఇప్పుడు సీనియర్ హీరో శరత్‌కుమార్‌తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే భార్యతో విబేధాలు రావడంతో శరత్‌కుమార్ కూడా విడాకులు ఇచ్చేశాడు. ఓ సినిమా షూటింగ్ టైంలో వీరి మధ్య చిగురించి పాత స్నేహం.. ప్రేమ మళ్లీ పెళ్లికి దారితీశాయి. ఆ తర్వాత పెళ్లయ్యాక వీరు మరో కుమారుడికి జన్మనిచ్చారు.
సీత:
మరో సీనియర్ నటి సీత. తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ సినిమా వాళ్లందరికి పరిచయం. ఆమె జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. తమిళ హీరో పార్తీబన్‌ను ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూతుళ్లు పుట్టాక మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెర హీరో సతీష్‌తో ఆమె ప్రేమలో పడి పెళ్లిచేసుకుంది. అయితే ఇప్పుడు సతీష్‌తో కూడా విడిపోయి ఆమె ఒంటరిగా ఉంటోంది.
గౌతమి – కమల్ హాసన్ :
కెరీర్ స్టార్టింగ్‌లో కమల్ – గౌతమి కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే కమల్ లైఫ్ వేరు. మనోడు మాంచి విలాస పురుషుడు.. రొమాంటిక్ గయ్. ముందు వాణి గణపతితో పెళ్లయ్యింది.. విడాకులు ఇచ్చేశాడు. తర్వాత బాలీవుడ్‌లో అప్పటి క్రేజీ హీరోయిన్ సారికను ప్రేమించాడు. ఇద్దరు కుమార్తెలు పుట్టాక మళ్లీ ఆమెకు విడాకులు ఇచ్చేసి… తన ఒకప్పటి హీరోయిన్ గౌతమితో 12 ఏళ్లకు పైగా సహజీవనం చేశాడు. గౌతమికి అప్పటికే పెళ్లయ్యి ఓ కూతురు కూడా ఉంది. అయినా కమల్‌కు దగ్గరైంది. చివరకు వారిద్దరు కూడా విడిపోయారు.