టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుకు కెరీర్ స్టార్టింగ్‌లో మురారి సినిమా ఓ స్పెషల్. రాజకుమారుడు హిట్‌తో మహేష్‌కు మాంచి ఓపెనింగ్ వచ్చింది. తొలి సినిమాతో హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ రెండూ ప్లాప్. దీంతో మహేష్‌తో పాటు కృష్ణ అభిమానులు డిఫెన్స్‌లో పడిపోయారు. ఎలాగైనా నాలుగో సినిమా హిట్ పడాలని అందరూ కసితో చేసిన సినిమాయే మురారి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ అప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే మహేష్‌కు జోడీగా నటించింది.
మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా సినిమాను ఎక్కడికో తీసుకువెళ్లింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు కూడా మేకర్స్‌కు, దర్శకుడు కృష్ణవంశీకి మధ్య ఎన్నో గొడవలు కూడా జరిగాయి. సినిమా రన్ టైం చాలా ఎక్కువుగా ఉందని.. దాదాపు మూడున్నర గంటల సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో కూర్చొని చూడలేరని. ట్రిమ్ చేయాలని కృష్ణవంశీపై ప్రెజర్ తీసుకువచ్చారు. అయితే కృష్ణవంశీ మాత్రం రన్ టైం తగ్గిస్తే దర్శకుడిగా తన పేరే వేయవద్దని బెదిరించడం.. చాలా గొడవలే జరిగాయి.
క్లైమాక్స్‌కు ముందు కళ్యాణం సాంగ్ విషయంలోనూ ఇదే పంచాయతీ.. క్లైమాక్స్‌కు ముందు ఈ సాంగ్ వేస్తే ఎవరు చూస్తారని మేకర్స్ కృష్ణవంశీని ప్రశ్నించారు. మహేష్ తండ్రి కృష్ణ కూడా అభ్యంతరం పెట్టినా చివరకు కృష్ణవంశీయే తన పంతం నెగ్గించుకుని ఆ సాంగ్ ఉండేలా చూసుకున్నారు. ఏదేమైనా సినిమా హిట్ అయ్యింది. మహేష్ కెరీర్లో ఓ క్లాసికల్ సినిమాగా నిలిచింది. అయితే మరీ అంత సూపర్ డూపర్ హిట్ట్ అయితే కాదు. హీరోగా మంచి పేరే వచ్చింది.
అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేస్తానంటున్నాడు మహేష్ మేనళ్లుడు గల్లా అశోక్. ఈ యేడాది సంక్రాంతికి హీరో సినిమాతో వెండితెరకు గ్రాండ్‌గా పరిచయం అయ్యాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా నిధి అగర్వాల్ హీరోయిన్. భారీ అంచనాలు, ఇటు గల్లా ఫ్యామిలీ బలమైన బ్యాక్ గ్రౌండ్.. సూపర్ స్టార్‌కు మేనళ్లుడు.. మరో సీనియర్ సూపర్‌స్టార్‌కు మనవడు. ఇటు ఘట్టమనేని అభిమానుల సపోర్ట్ ఉన్నా కూడా హీరో ఫెయిల్ అయ్యింది.
ప్రస్తుతం గ్యాప్ తీసుకుంటోన్న అశోక్ త్వరలోనే తన రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పాడు. మహేష్‌బాబు గారి సినిమాల్లో మీరు ఏది రీమేక్ చేయాలని అనుకుంటున్నారు అని అడిగితే మురారి పేరు చెప్పాడు. ఆ సినిమా అంత అద్భుతమైన కథ మళ్లీ రాకపోవచ్చు. మహేష్ బాబు గారు చాలా గొప్పగా చేశారు.. రీమేక్ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మురారియే చేస్తానని చెప్పాడు అశోక్.