నేటి రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నటీనటులు ఎంత కమర్షియల్ గా మారిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో మంచి పాపులరిటీ ఉన్నప్పుడే రెండు చేతులా సంపాదిస్తు లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత బాగా ఫాలో అవుతున్నారు. దీంతో ఒకవేళ సినిమా అవకాశాలు తగ్గినా ఎక్కడా ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగానే జాగ్రత్తతో బ్యాంకు బాలన్స్ మెయింటెన్ చేస్తూ ఉన్నారు.
కాని ఒకప్పుడు మాత్రం ఎంతోమంది… సరైన అవకాశాలు ఉన్నప్పుడు లేదా పాపులారిటీ ఉన్నప్పుడు బాగా డబ్బులు వచ్చినా వాటిని సరిగ్గా కూడబెట్టలేక ఆ తర్వాత ఇబ్బంది పడిన వారు ఉన్నారు. ఎవరో ఎందుకు ? మహానటి సావిత్రి జీవితమే ఇందుకు నిదర్శనం. మరికొంతమంది తమ వారసులను ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు సంపాదించిన మొత్తం ఖర్చు పెట్టి చివరిరోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఇలాంటి కోవకు చెందిన ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి. జనవరి 18, 1954 లో జన్మించిన ఈయన భారత దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇండియన్ ఫ్యాషన్ యాడ్స్ ఫోటోషూట్స్ మాత్రమే కాకుండా… సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు.
ఈయన కూతురే హీరోయిన్ అంత్ర మాలి. తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన రాంగోపాల్ వర్మ ప్రేమకథ సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. ఖిలాడి 420, కంపెనీ, రోడ్డు, గాయం, నాచ్, మిస్టర్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. వరుస అవకాశాలు అందుకుంది గాని ఊహించనంత స్టార్ డమ్ సంపాదించలేకపోయింది. అయితే అప్పట్లో రేఖ – అనుపమ్ ఖేర్ – ఇర్ఫాన్ ఖాన్ – మనీషా కొయిరాలా వంటి వారికి పోర్టుఫోలియో ఫోటోలని తొలిసారి తీసిన వ్యక్తిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు జగదీష్.
అయితే ఇలా భారీగా పాపులారిటీతో పాటు డబ్బులు కూడా సంపాదించాడు. అయితే తన కూతురును హీరోయిన్ నిలబెట్టేందుకు తన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆమెను నార్త్‌తో పాటు సౌత్‌లో బాగా ప్రమోట్ చేశాడు. దీంతో ఆయన ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరి రోజుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని దీన స్థితిలో మరణించారు ఈయన. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఏకంగా ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేయించడం గమనార్హం. ఆయన 59వ ఏట ఆరోగ్యం విషమించి చనిపోయారు జగదీష్. తన కోసం అంత చేసిన తండ్రిని చివర్లో అంత్రమాలి పట్టించుకోలేదన్న ప్రచారమూ ఉంది.