హీరో నితిన్ ఇప్పుడు టైర్ టు హీరోల్లో తనకంటూ సపరేజ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. నితిన్ రెండు దశాబ్దాల క్రితం 2002లో వచ్చిన జయం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు. చిత్రం మూవీస్ బ్యానర్‌పై అప్పట్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు తేజ స్వీయదర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో చిత్రం, నువ్వు నేను లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో తేజ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. తేజ సినిమాలు అంటే యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఉండేవి.
నువ్వు నేను హిట్ తర్వాత తేజ జయం సినిమా తీశాడు. అప్పుడు నైజాంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి టాప్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవారు. సుధాకర్ రెడ్డి కొడుకును హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీస్తుండడం.. అందులోనూ తేజ స్వీయ దర్శకత్వం.. హీరోయిన్ సదాతో పాటు అందరూ కొత్తవాళ్లే కావడంతో సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక ఆర్పీ పట్నాయక్ సాంగ్స్ రిలీజ్‌కు ముందే ఊపేశాయి. 2002 జూన్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా బడ్జెట్ రు. 2 కోట్లు కాగా.. రు. 10 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి.
బెస్ట్ విలన్‌గా గోపీచంద్, బెస్ట్ మేల్ కమెడియన్‌గా సుమన్ శెట్టి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా శ్వేత, వెళ్లవయ్యా వెళ్లు అంటూ హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పిన సింగర్ సునీత ఇలా మొత్తం నాలుగు అవార్డులు జయం సొంతం అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో సదా పదే పదే టేకులు తీసుకోవడంతో సీరియస్ అయిన తేజ ఆమెను కొట్టినట్టు వచ్చిన వార్తలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇది పెద్ద వివాదం అయ్యింది. తేజ తన సినిమాలో పదే పదే హీరోయిన్లపై చేయి చేసుకుంటాడన్న ప్రచారం తీవ్రంగా జరిగింది.
అయితే వాళ్లను తాను కావాలని కొట్టను అని.. నటనలో భాగంగా ఒక్కోసారి అలా జరుగుతుందని తేజ తర్వాత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు నువ్వు నేను సినిమా టైంలో కూడా హీరోయిన్ అనితపై చేయి చేసుకున్నారన్న ప్రచారం తేజపై జరిగింది. ఇక జయంలో తేజ చేయి చేసుకోవడంతో హీరోయిన్ సదా భోరున ఏడ్చేస్తే అప్పుడు హీరో నితిన్ ఆమెను ఓదార్చడంతో పాటు తేజపై ఫైర్ అయ్యాడని.. షూటింగ్‌కు రానని తేల్చిచెప్పాడన్న టాక్ కూడా బయటకు వచ్చింది.
ఇక సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా పాటలు ఎక్కువుగా ఉన్నాయని.. రన్ టైం బాగా ఎక్కువుగా ఉందన్న విషయంలో దర్శకుడు తేజకు, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి కూడా వాదోపవాదాలే జరిగాయి. అలా రిలీజ్‌కు ముందే వివాదాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే తిరుగులేని బ్లాక్‌బస్టర్ టాక్‌తో జయం నితిన్ కెరీర్‌లో మంచి మైలురాయిగా నిలిచిపోయింది.