ఏదేమైనా 2018 తర్వాత అంటే నాలుగేళ్లకు మళ్లీ రేపు ఎన్టీఆర్ వెండితెరపై హీరోగా కనిపించనున్నాడు. అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ అయ్యి నాలుగేళ్లు అయ్యింది. అందుకే మధ్యలో చాలా మీమ్స్ కూడా వచ్చేశాయి. ఓ కుర్రాడు ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ రాసే టైంలో త్రిబుల్కు రాజమౌళి క్లాప్ కొట్టాడు. ఇప్పుడు ఆ కుర్రాడు బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్‌కు కూడా సెలక్ట్ అయ్యాడు. అయినా కానీ త్రిబుల్ ఆర్ రిలీజ్ కాలేదు.. అంటే రాజమౌళి ఈ సినిమా కోసం ఎంత టైం స్పెండ్ చేశాడో తెలుస్తోంది.
పూర్తిగా రాజమౌళి తప్పు అనలేం కాని.. కరోనా మూడు సార్లు రావడం.. ఏపీలో టిక్కెట్ రేట్ల ఇష్యూలు.. రాజమౌళి కంప్లీట్ పర్ఫెక్షన్ ఇవన్నీ ఈ సినిమా ఇంత టైం పట్టడానికి కారణాలే. సరే ఈ తతంగాలు ఎలా ? ఉన్నా కూడా రేపు సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోంది. సగటు సినిమా అభిమాని నుంచి ఎన్టీఆర్, అటు చరణ్ ఫ్యాన్స్ ఇలా ఎవరి నోట విన్నా ఇప్పుడు ఈ సినిమా గురించి చర్చే నడుస్తోంది.
ఇప్పటికే ప్రివ్యూ షోలు దిల్ రాజుతో పాటు కొందరు ఇండస్ట్రీ పెద్దలు చూసేశారని అంటున్నారు. సినిమా సూపర్ అంటున్నారని కూడా టాక్ ఇండస్ట్రీలో వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సన్నిహితులకు ఫస్ట్ డే చూపించేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మల్టీఫ్లెక్స్‌లో ఉదయం 11 గంటల షోకు ఓ స్క్రీన్ అంతా తానే బుక్ చేసుకున్నాడట.
ఈ స్పెషల్ షోకే ఎన్టీఆర్ తల్లి శాలినితో పాటు భార్య లక్ష్మీ ప్రణతి.. ఎన్టీఆర్ భార్య తరపు బంధువులు, సన్నిహితులు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఫ్యాన్స్ షోలు, ప్రీమియర్ షోల హడావిడి అయితే మామూలుగా లేదు. కూకట్పల్లి, మూసాపేట, బోరబండ, నిజాంపేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలో తెల్లవారు ఝామున 4 గంటల నుంచే ప్రీమియర్లు పడుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టిక్కెట్ రేట్లు, షోల విషయంలో ఫుల్ పర్మిషన్లు ఇచ్చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా టిక్కెట్ రేట్లతో పాటు ఐదో షో వేసుకునే వెసులు బాట్లు ఇచ్చింది. ఇక బొమ్మ పడి దాని దమ్ము తేలితే వసూళ్లు కుమ్ముకోవడం ఖాయం.. రికార్డుల గత్తర లేపడం పక్కా..!