Moviesరామ్ చ‌ర‌ణ్ త‌న భార్య కంటే ఎన్నేళ్లు చిన్న‌వాడో తెలుసా..?

రామ్ చ‌ర‌ణ్ త‌న భార్య కంటే ఎన్నేళ్లు చిన్న‌వాడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా సినీ గ‌డ‌ప తొక్కిన రామ్ చ‌ర‌ణ్‌.. త‌న‌దైన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్‌గా ప్ర‌త్యేక‌మైన‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీ హీరోగా గ‌డుపుతున్న ఈయ‌న‌.. త్వ‌ర‌లోనే పాన్ ఇండియా స్టార్‌గానూ మార‌బోతున్నాడు. రామ్ చ‌ర‌ణ్ వ్య‌క్తిగ‌త జీవితం విషయానికి వ‌స్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ఐదేళ్లు ప్రేమించి 2012 జూన్ 14న పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నాడు.

అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఇరు కుటుంబ స‌భ్యులు వీరి వివాహాన్ని జ‌రిపించారు. ఉపాస‌న ఇటు ఇటు అపోలో ప్ర‌తాప్‌రెడ్డికి మ‌న‌వ‌రాలు అయితే.. అటు నిజామాబాద్ జిల్లా దోమ‌గూడ రాజ‌సంస్థ‌నాధీశురాలు. వివాహం అనంత‌రం అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వ‌హిస్తున్న ఉపాస‌న‌.. మ‌రోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మెగా కోడ‌లు అనిపించుకుంటోంది. ఇక‌పోతే టాలీవుడ్‌లో స్టార్ క‌పుల్‌గా గుర్తింపు పొందిన రామ్ చ‌ర‌ణ్‌, ఉప‌స‌న‌ల మ‌ధ్య వ‌య‌సులో చాలా వ్య‌త్యాసం ఉంది.

అవును, భార్య ఉపాస‌న కంటే చ‌ర‌ణ్ నాలుగేళ్లు చిన్న‌వాడు. అయినా స‌రే వీరి నిజ‌మైన ప్రేమ‌కు వ‌య‌సు అడ్డుకాలేదు. ముందుగా చ‌ర‌ణే ఉపాస‌న ప్రేమ‌లో ప‌డిపోయాడు. ఆ త‌ర్వాత ఉపాస‌న కూడా వ‌య‌సు తార‌త‌మ‌య్యాల‌తో సంబంధం లేకుండా చ‌ర‌ణ్‌ను మ‌న‌స్ఫూర్తిగా ఇష్ట‌ప‌డింది. ఆ త‌ర్వాత పెద్ద‌లు కూడా వీరి ప్రేమ‌ను అంగీక‌రించ‌డంలో పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఇటీవ‌లె ఈ జంట రూ. 10 కోట్లతో ఓ మంచి ఇంటిని నిర్మించుకుని.. అక్క‌డే నివాసం ఉంటున్నారు.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. రామ్ చ‌ర‌ణ్ తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో ఎన్టీఆర్ మ‌రో హీరోగా న‌టించాడు. భారీ అంచ‌నాల న‌డుమ మార్చి 25న ఈ పాన్ ఇండియా మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇక త‌న తండ్రితో క‌లిసి న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోంది. అలాగే మ‌రోవైపు చ‌ర‌ణ్ త‌న 15న సినిమాను శంక‌ర్‌తో స్టార్ట్ చేశాడు. ఇది పూర్తైన అనంత‌రం గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా చేయ‌నున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news