Moviesఎన్టీఆర్ స్ట్రాంగ్ క్లాస్ పీక‌డంతో లైన్లోకి వ‌చ్చిన సినీన‌టులు... చెన్నైలో ఏం...

ఎన్టీఆర్ స్ట్రాంగ్ క్లాస్ పీక‌డంతో లైన్లోకి వ‌చ్చిన సినీన‌టులు… చెన్నైలో ఏం జ‌రిగిందంటే..!

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు.. అన్న‌గారు ఎన్టీఆర్ సుదీర్ఘ‌కాలం సినీ రంగంలో ఉన్నారు.. అయితే.. ఆయ‌న న‌ట జీవితం అనేక ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. వీటిలో చాలా వ‌ర‌కు ఆద‌ర్శ‌నీయ ఘ‌ట్ట‌గాలుగా సినీ రంగంలో పేరు తెచ్చుకున్నాయి. ప్ర‌ధానంగా.. పంక్చ్యువాలిటీకి అన్న‌గారు పెద్ద‌పీట వేసేవారు. సినిమా ఏదైనా.. షూటింగ్ ఎక్క‌డ జ‌రిగినా.. స‌మ‌యానికి అక్క‌డ‌కు వెళ్లిపోవ‌డం అన్న‌గారితోనే మొద‌లైంద‌నే చెప్పాలి. గ‌తంలో ఓల్డ్ ఆర్టిస్టులు కూడా.. ఆల‌స్యంగా వ‌చ్చేవారు. దీంతో నిర్మాత‌లు ఇబ్బంది ప‌డేవార‌ట‌.

ఎందుకంటే.. చెన్నైలో అప్ప‌ట్లో బ్రిటీష్ వారి హ‌యాంలో ఔట్ డోర్ షూటింగుల‌కు నిర్నీత స‌మ‌యంలో దాటితే.. మ‌ళ్లీ మ‌ళ్లీ అనుమ‌తులు తీసుకోవాల్సి వ‌చ్చి.. సినిమా షూటింగులు వాయిదా ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక‌, ఇన్‌డోర్ షూటింగుల్లోనూ.. స‌మ‌యానికి రాక‌పోతే.. ఇబ్బందులు ఎదుర‌య్యేవ‌ట‌. ఈ విష‌యంలో అన్న‌గారు స్ట్రిక్టుగా ఉండే వార‌ని..ఇప్ప‌టికీ.. నాటి త‌రం సినిమా న‌టులు చెప్పుకొంటారు. అంతేకాదు, ఒక్క పంక్చ్యువాలిటీలోనేకాదు… సినిమా షూటింగ్ స‌మ‌యంలో సిగ‌రెట్లు తాగ‌డం.. ఫ్రెండ్స్ వ‌చ్చార‌ని.. అభిమానులు వ‌చ్చార‌ని, వారితో ముచ్చ‌ట్లు పెట్టుకోవ‌డం వంటివి కూడా అన్న‌గారు చేసేవారు కార‌ట‌.

ఇదంతా కూడా తోటి న‌టీన‌టుల‌కు ఆద‌ర్శంగా ఉండేద‌ని.. ఇప్ప‌టికీ చెప్పుకొంటారు. అప్ప‌ట్లో సీనియ‌ర్ న‌టులు ఎక్కువ‌గా సిగ‌రెట్లు కాల్చేందుకు స‌మ‌యం తీసుకునేవార‌ట‌. దీంతో షూటింగులు ఆల‌స్యం అయ్యేవ‌ట‌. దీంతో నిర్మాత‌లు పైకి చెప్ప‌లేక‌.. మ‌న‌సులో దాచుకోలేక ఇబ్బందులు ప‌డేవార‌ట‌. ఇక‌, అన్న‌గారి శైలితో ఇలాంటి వారు దారికి వ‌చ్చార‌ట‌. ఇక‌, మ‌రో ముఖ్య‌మైన‌.. ఇప్ప‌టికీ ఆద‌ర్శ‌వంత‌మైన‌.. అన్న‌గారి అల‌వా టు.. నిర్మాత‌ల‌ను గౌర‌వించ‌డం. గ‌తంలో పాత‌త‌రం న‌టులు కూడా నిర్మాత‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇచ్చేవారు కార‌ట‌.

నిర్మాత‌లు ఉన్నారంటే.. మేం సినిమాలు చేస్తేనే క‌దా..అనే భావ‌న వారిలో ఉండేద‌ట‌. కానీ, అన్న‌గారు మాత్రం నిర్మాత‌ల‌కు ఎన‌లేని గౌర‌వం ఇచ్చేవార‌ట‌. నిర్మాత‌లు లేక‌పోతే.. సినిమాలు ఎక్క‌డ ఉన్నాయ‌ని.. ఆయ‌న అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో క‌ల‌సి.. చెన్నైలో పెద్ద స‌భ పెట్టి.. న‌టీన‌టుల‌ను పిలిచి మ‌రీ క్లాస్ తీసుకున్నార‌ట‌. అంతేకాదు.. నిర్మాత క‌న్నాముందే..న‌టులు షూటింగ్ ప్లేస్‌ల‌కు రావడం అనేది అన్న‌గారి నుంచే అల‌వాటు చేసుకున్నారు. ఇక‌, నిర్మాత షూటింగు ప్రాంతానికి వ‌చ్చాక‌, కూర్చున్న చోట నుంచి(ఒక వేళ షూటింగులో ఉంటే అది అయ్యాక వెంట‌నే) వ‌చ్చి.. నిర్మాత‌ను రిసీవ్ చేసుకుని.. న‌మ‌స్కారం పెట్ట‌డం అనేది.. అన్న‌గారు ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటార‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తుంది.

ఇది ఆయ‌న సినీ న‌ట జీవితంగా చివ‌ర‌కు పాటించిన అద్బుత పాఠంగా చెబుతారు. అంతేకాదు. గ్రూపులు క‌ట్ట‌డం, గొడ‌వ‌ల‌కు దిగడం.. తొటి న‌టుల‌ను విమ‌ర్శించ‌డం.. కయ్యాలు పెట్టుకోవ‌డం వంటి వాటిని అన్న‌గారు అస్స‌లు స‌హించేవారు కాద‌ని అంటారు. ఇవ‌న్నీ.. అన్న‌గారి లో ఉన్న ప్ర‌త్యేక‌త‌లు. అయితే.. ఇవ‌న్నీ ఇప్పుడు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. నిర్మాతల విష‌యంలో మాత్రం అన్న‌గారు వేసిన బాట‌ను ఇప్ప‌టికీ.. చాలా మంది యువ త‌రం న‌టులు కూడా పాటిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news