టాలీవుడ్ చరిత్రలో విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ క్రేజ్, రేంజ్ గురించి తెలిసిందే. ఎన్టీఆర్ మనలను వీడి వెళ్లి రెండున్నర దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటకీ ఆయనంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ ఆరాధ్యదైవమే. సినీ రంగంలోనే కాదు.. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన ఘనత.. అందులోనూ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కి దేశ రాజకీయాల్లో తిరుగులేని రికార్డులు నెలకొల్పిన చరిత్ర ఎన్టీఆర్కే సొంతం.
ఎన్టీఆర్ తన కీర్తి కిరీటంలో ఎన్నో రికార్డులు లిఖించుకున్నారు. భారతదేశ సినిమా చరిత్ర 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎన్ ఎన్ – ఐబీఎన్ వారు ఓ సర్వే చేశారు. ఈ సర్వే ప్రకారం భారత ప్రఖ్యాత నటుడిగా 53 % ఓట్లతో అన్నగారు మొదటి స్థానంలో నిలిచారు. భారతదేశ సినీ చరిత్రలో ఎంతోమంది హీరోలు ఉంటారు. అయితే మొత్తం పోలైన ఓట్లలో కేవలం 53 % ఓట్లు ఎన్టీఆర్కు వస్తే… మిగిలిన 47 % శాతం ఓట్లు ఇతర హీరోలకు వస్తాయి.
ఇలాంటి గొప్ప రికార్డు దేశంలో ఏ హీరోకు మాత్రం దక్కుతుంది. అలాగే ఇదే అంశంపై ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో 73 % ఓట్లతో ఎన్టీఆర్ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం పోలైన ఓట్లలో మిగిలిన హీరోలు దరిదాపుల్లో లేకుండా ఈ రేంజ్లో ఓట్లు వచ్చాయంటే ఎన్టీఆర్ అంటే తెలుగు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో. ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో ఎలా నిలిచిపోయారో తెలుస్తోంది.
ఎన్టీఆర్ తన కెరీర్లో సాధించిన అవార్డుల్లో కొన్ని మచ్చుతునకకు మాత్రం ఈ కింద ఇస్తున్నాం..
1954 – ఉత్తమ నటుడు, భారత రాష్ట్రపతి అవార్డు
1954 – నేషనల్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు
1960 – నేషనల్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు
1963 – ఉత్తమ నటుడు, భారత రాష్ట్రపతి అవార్డు
1968 – నేషనల్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు
1972 – ఉత్తమ నటుడు, ఫిల్మ్ ఫెయిర్ సౌత్
1974 – నంది అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
1978 – ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్