Moviesమగాళ్లంతా అలాంటి వాళ్లే..ఆ ఒక్కడు తప్పా..ఎవ్వారా ఒక్క మగాడు..?

మగాళ్లంతా అలాంటి వాళ్లే..ఆ ఒక్కడు తప్పా..ఎవ్వారా ఒక్క మగాడు..?

కృతిస‌న‌న్..ఓ హాట్ బ్యూటి. బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడు తన లేలేత అందాలని తెలుగు ప్రేక్షకులకు కూడా రుచి చూపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆతర్వాత తెలుగులో నాగచైతన్య నటించిన దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది. దీంతో ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలను అందుకోలేకపోయింది కృతి.

ఆ తర్వాత తెలుగు నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు.. అక్కడ మాత్రమే వరుస ఆఫర్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది…అక్ష‌య్ కుమార్‌, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల‌తోపాటు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది. ఆదిపురుష్ తో పాటు హమ్ దే హమారే దో,గణపత్,బేధియా,బచ్చన్ పాండే వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

కాగా ఆమె నతించిన బచ్చన్ పాండే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గోంటుంది..ఈ హాట్ బ్యూటి. ఈ క్రమంలోనే..ఓ ఇంటర్వుల్లో మాట్లాదుతూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని పొగిడేసింది. జనరల్ గా ఇండస్ట్రీలో ఉండే మగాళ్ల అంతా ఆడవాళ్లను తగ్గువుగా చూస్తారని..ముఖ్యంగా క్యారెక్టర్ విషయంలో అమ్మాయిలను తక్కువుగా చేయటం ఎప్పటి నుండో సినీ ఇందస్ట్రీలో కొనసాగుతుందని. హీరోలకంటే హీరోయిన్స్ కొంచెం డామినేటెడ్ రోల్ చేస్తున్న ఓర్వ లేరని..షాకింగ్ కామెంట్స్ చేసింది.

కానీ అక్షయ్ కుమార్ అలాంటి వాడు కాదని.. చాలా మంచి వ్యక్తి..హీరోయిన్స్ క్యారెక్టర్ ఎక్కువైనా ఆయన పట్టించుకోడు..నటనకు ప్రాధ్యానం ఇచ్చే మనిషి.. మహిళ ప్రధాన పాత్ర పోషించే సినిమాల్లోనూ చిన్న పాత్ర చేయడానికి ఆయన వెనకాడడని చెప్పేందుకు ‘అత్రంగి రే’ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేమంటూ ప్రశంసలు కురిపించింది. ఇక కృతి మాటలను పట్టుకుని ఆమెను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్ ..నీ దృష్టిలో ఆయన ఒక్కడే మగాడా అంటూ పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news