ReviewsTL రివ్యూ: ఆడవాళ్లు మీకు జోహార్లు... సెకండాఫ్ మీకు అర్థ‌మ‌వుతుందా..

TL రివ్యూ: ఆడవాళ్లు మీకు జోహార్లు… సెకండాఫ్ మీకు అర్థ‌మ‌వుతుందా..

టైటిల్‌: ఆడవాళ్లు మీకు జోహార్లు
నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, ఖుష్బు, రాధిక శరత్‌కుమార్ మరియు ఊర్వశి
ఎడిటింగ్‌: ఏ. శ్రీక‌ర ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్‌
మ్యూజిక్‌: దేవి శ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : కిషోర్ తిరుమల
రిలీజ్ డేట్‌: 4 మార్చి, 2022

శర్వానంద్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్‌గా నేను శైల‌జ ఫేం తిరుమ‌ల కిషోర్ వ‌చ్చిన సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. చెరుకూరి సుధాక‌ర్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో అంచ‌నాలు రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందో TL స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
చిరంజీవి (శర్వానంద్) కళ్యాణమండపం నడుపుతూ లైఫ్ గ‌డుపుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ల కార‌ణంగా పెళ్లి కాని ప్ర‌సాద్‌లా మిగిలిపోతూ ఉంటాడు. పెళ్లి కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా కుద‌ర‌దు. చివ‌ర‌కు ఆద్య (ర‌ష్మిక‌) ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. చిరంజీవితో ట్రావెల్ చేసే క్ర‌మంలో ఆద్య‌కు కూడా చిరంజీవిపై ఇష్టం క‌లుగుతుంది. త‌న త‌ల్లి వ‌కుల (ఖుష్బూ)కు ఈ పెళ్లి ఇష్టం లేద‌ని.. అందువ‌ల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోలేన‌ని చెపుతుంది. అస‌లు వ‌కుల‌కు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదు.. త‌ల్లి మ‌న‌సు మారేందుకు చిరంజీవి ఏం చేస్తాడు ? చిరు – ఆద్య క‌లిశారా ? లేదా ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

విశ్లేష‌ణ :
పెళ్లి వ‌ద్దే వ‌ద్దు అనుకునే ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది ? అన్న బేసిక్ లైన్‌ను వీలైనంత కామెడీతో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు తిరుమ‌ల కిషోర్‌. హీరోయిన్ త‌ల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్న ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ బాండింగ్ బాగుంది. ఇక శ‌ర్వానంద్ కామెడీ టైమింగ్‌, ఎమోష‌న‌ల్ యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ ర‌ష్మిక స్ట‌న్నింగ్ లుక్‌, గ్లామ‌ర‌స్ పెర్పామెన్స్‌తో ఆక‌ట్టుకుంది. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో ఖుష్బూ న‌ట‌న సినిమాకు ఆయువుప‌ట్టుగా నిలిచింది. మ‌రో ప్ర‌ధాన పాత్ర చేసిన రాధిక శ‌ర‌త్‌కుమార్‌, ఇత‌ర న‌టీన‌టులు పాత్ర‌ల‌తో మెప్పించారు.

సినిమాలో కొన్ని చోట్ల కామెడీ బాగానే వర్కౌట్ అయినా ప్లే ఇంట్ర‌స్టింగ్ అనిపించ‌లేదు. క‌థాంశం బాగున్నా సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే మ్యాజిక్ లేక స్లో నెరేష‌న్ కూడా బాగా ఇబ్బంది పెట్టింది. సెకండాఫ్‌లో సెటప్‌, సీన్లు, స్క్రీన్ ప్లే అంతా రొటీన్‌కే రొటీన్‌గా ఉంది. హీరో – హీరోయిన్ ల‌వ్ సీన్లు కొత్త‌గా లేవు. క‌థ‌తో సంబంధం లేని సీన్లు ఎక్కువుగా ఉన్నాయి. ఓవ‌రాల్‌గా ద‌ర్శ‌కుడు తాను అనుకున్న క‌థ‌ను తెర‌మీద బాగా ఎలివేట్ చేయ‌లేదు. సెకండాఫ్ బోరింగ్‌గానే ఉంటుంది.

టెక్నిక‌ల్‌గా తిరుమ‌ల కిషోర్ డైరెక్ష‌న్ బాగున్నా.. స్క్రీన్ ప్లే మీద కాన్‌సంట్రేషన్ చేయ‌లేద‌నిపిస్తుంది. ల్యాగ్ సీన్స్ బోర్ కొట్టించాయి. దేవిశ్రీ పాట‌లు, ఆర్ ఆర్ ఓకే. ఎడిటింగ్‌లోనూ ట్రిమ్ చేయాలి. సినిమాటోగ్ర‌ఫీ గుడ్‌. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా చెప్పాలంటే ఆడ‌వాళ్లూ మీకు జోహార్లు ప‌ర‌మ రొటీన్ డ్రామాయే.. ఫ‌స్టాఫ్ బాగున్నా.. సెకండాఫ్ గురించి ఎంత త‌క్కువ చెపితే అంత మంచిది.

ఆడ‌వాళ్లూ మీకు జోహార్లు TL రేటింగ్‌: 2.5 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news