యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమా ఒకటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సంచలనాలు నమోదు చేయకపోయినా బాలయ్యను వెండితెరపై చాలా కొత్తగా ప్రెజెంట్ చేసింది. బాలయ్యను ఆయన అభిమానులే ఎప్పుడూ చూడని కొత్త తరహాలో చూపించటంలో పూరి చాలా సక్సెస్ అయ్యారు. బాలయ్య సైతం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా చేస్తున్నంతసేపు తను బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. అలాగే తనతో పూరి ఎప్పుడు సినిమా చేయాలని అనుకున్నా రెడీగా ఉంటాను అని కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఎప్పుడు యాక్షన్ కథలు లేదా ఫ్యాక్షన్ కథలు లేదా చారిత్రక పౌరాణిక సినిమాలే చేసిన బాలయ్యను పూరి చాలా చాలా కొత్తగా చూపించారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. బాలయ్య నటన నుంచి.. డైలాగ్ మాడ్యులేషన్ వరకు అన్ని పైసా వసూల్ సినిమాలో కొత్తగా కనిపించాయి.ఈ సినిమాలో బాలయ్య మామ ఏక్ పెగ్ లా అనే సాంగ్ స్వయంగా పాడారు. ఈ సాంగ్‌ను కేవలం బాలయ్య అభిమానులే కాకుండా తెలుగు సినిమా అభిమానులు అందరూ బాగా ఎంజాయ్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కు బాలయ్య వార్నింగ్ ఇచ్చారట. ఈ వార్నింగ్ వెనుక ఆసక్తికరమైన సంఘటన జరిగినట్టు అనూప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అనూప్ సాంగ్ రికార్డింగ్ చేసే టైంలో కన్ను కన్ను కలిశాయి అన్న ట్రాక్ సరదాగా పాడే పాడాడట. అయితే పూరి దీనిని బాలయ్యకు వినిపించగా దీనిని ఎవరు పాడారని బాలయ్య అడిగారట. అయితే దీనిని ఫిమేల్ వెర్షన్ లో పాడించాలని అనూప్ ప్లాన్ చేస్తున్నాడని చెప్పగా… బాలయ్య మాత్రం ఈ వాయిస్ కంటిన్యూ చేయండి దీన్ని కదిపితే అసలు బాగుండదని వార్నింగ్ ఇచ్చాడట.
దీంతో ఈ సాంగ్ ఫిమేల్ వెర్షన్ పాడించకుండా అనూప్ పాడిన దానినే కంటిన్యూ చేశారు. ఇదే సమయంలో మామ ఏక్ పెగ్ లా సాంగ్ కు ముందు కొన్ని డైలాగులు వస్తాయి. ఆ డైలాగులు బాలయ్యతో చెప్పించి వేరే సింగర్స్‌తో సాంగ్ పాడించాలని ముందుగా అనుకున్నా బాలయ్య డైలాగ్ ఎనర్జీ చూశాక బాలయ్యతోనే ఈ పాటను పాటించాలని ఫిక్స్ అయిపోయాడు అనూప్.
ఈ విషయాన్ని పూరికి చెప్పగా పూరి బాలయ్యను అడగడంతో… వెంటనే పాట పాడతానని ఓకే చెప్పేశాడట. ఈ సాంగ్ కి ముందు డైలాగులు బాలయ్య చెప్పాల్సి రావడంతో… పూర్తి రిక్వెస్ట్ మేరకు బాలయ్య సాంగ్ ముందే ప్రాక్టీస్ చేసి వచ్చి కేవలం గంటలో ఫినిష్ చేశారట. బాలయ్య డెడికేషన్‌కు తాను ఆశ్చర్యపోయానని… గంటలో ఆయన పాట మొత్తం పాడేసి అయిపోయిందా ? అనడంతో తాను ఆ మూడ్ నుంచి ఇంకా బయటకు రాలేదని అంటూ బాలయ్యపై అనూప్ ప్రశంసల వర్షం కురిపించాడు.