Moviesవావ్: అఖండలో అఘోర పాత్రకు మేకప్ వేసింది ఆమెనా..గ్రేట్..!!

వావ్: అఖండలో అఘోర పాత్రకు మేకప్ వేసింది ఆమెనా..గ్రేట్..!!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. అంతక ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో జనరల్ గానే ఈ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇక ఆ అంచనాలని ఏ మాత్రం తగ్గించకుండా..డబుల్ చేస్తూ..బాలకృష్ణ లోని సరికొత్త లుక్ ని పరిచయం చేశాడు బొయపాటి. డిసెంబర్ 2న రిలీజైన ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అశేష ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా లో బాలయ్య పక్కన ప్రగ్నా బాగా నటించి జనాలను మెప్పించింది. వరదరాజులు పాత్రలో శ్రీకాంత్ విలన్ గా అద్దరగొట్టారు. జగపతిబాబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ లో కనిపించి నందమూరి అభిమానులకు డబుల్ షేడ్స్ చూయించారు. ఒక్క పాత్రల్లో సాధారణంగా కనిపించినా మరొక్క పాత్రల్లో అభిమానాలకు పూనకం వచ్చేలా కనిపించారు. ఇందులో అఘోర పాత్రతో పాటు మురళీకృష్ణ అనే రైతు పాత్ర కూడా బాలయ్య చేసి మెప్పించాడు. ఇందులో అఘోర పాత్రలో బాలయ్య నటనకు జనం జేజేలు పలికారు. సాధారణంగా బాలకృష్ణ సెంటిమెంట్స్ ను పాటిస్తారనే సంగతి తెలిసిందే. దైవ భక్తుడైన బాలకృష్ణ బాల్యంలోనే శ్లోకాలను అవపోసన పట్టి పలు సందర్భాల్లో వేదికలపై తన ప్రతిభను ప్రదర్శించారు.

 

అఘోర పాత్రల్లో బాలయ్య అభిమానులే కాదు, ఆడియన్స్ కి కూడా బాగా నచ్చిదని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా అఘోర పాత్రల్లో బాలయ్యను చూస్తే అచ్చం శివుడిని చూసినట్లు ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో మొదటి సారిగా అఘోర పాత్రలో కనిపించిన బాలయ్య..ఆ పాత్ర కోసం చాలా కష్ట పడ్డారట. ముఖ్యంగా అఘోర పాత్రలో చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అయితే ఇంతగా ఆకట్టుకున్న ఈ పాత్రకు మేకప్ వేసింది మేకప్ మ్యాన్ ఎవరంటే ఒక ఉమెన్.

ఈ పాత్ర కోసం బాలయ్యకు పంజాబ్ కి చెందిన విధి మేకప్ వేసేదట. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లేచి.. బాలయ్యకు మేకప్ వేసి..ఇన్ టైంకే తన ఎదుట బాలయ్యను నిలబెట్టెదని ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చాడు డైరెక్టర్. అంతేకాదు ఈ మేకప్ కి గంటన్నర నుంచి రెండు గంటలు పట్టేదట. వీళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news