టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ఒక్కడు. 2003 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా 130 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఒక్కడు వచ్చిన వెంటనే మహేష్ బాబు.. తేజ దర్శకత్వంలో నిజం సినిమాలో నటించారు. నువ్వు నేను, జయం లాంటి సూపర్ హిట్ తర్వాత ఫుల్ ఫామ్ లో ఉన్న తేజ ఏకంగా మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. చిత్రం మూవీస్ బ్యానర్ పై తేజ సొంత బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. రక్షిత మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా… ఆర్పి పట్నాయక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
ఈ సినిమా ఆల్బమ్ సక్సెస్ అయిన తర్వాత మహేష్ బాబు ఇమేజ్ అమాంతం మారిపోయింది. మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు కోరుకునే అంశాలు లేకపోవడం.. కమర్షియల్‌గా సక్సెస్ అయ్యే కథ కాకపోవడంతో నిజం సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ సినిమాలో సెకండాఫ్ లో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర కోసం ముందుగా సీనియర్ నటుడు మురళీ మోహన్ ను తేజ ఎంపిక చేసుకున్నారు. మురళీమోహన్ పాత్రను 70 శాతం షూటింగ్ పూర్తి చేశాక.. ఎడిటింగ్ లో చూసిన తేజ తనకు నచ్చలేదని మురళీమోహన్‌ను సినిమా నుంచి తప్పించేశారు.
ఆ స్థానంలో రియల్ స్టార్ శ్రీహరి అయితే బాగుంటుందని శ్రీహరిని సంప్రదించారట. అయితే శ్రీహరి ప్రకాష్ రాజ్ ను సిఫార్సు చేయడంతో చివరకు తాము ప్రకాష్‌రాజ్‌ను తీసుకున్నామని తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మురళీమోహన్ పాత్రకు ఆయన బాడీ లాంగ్వేజ్ కు… ఆయన లిప్ మూమెంట్ కు మధ్య పొంతన లేదని.. ఆ పాత్రకు ఆయన సెట్‌కారన్న విషయం తమకు ఎడిటింగ్ రూమ్‌లో అర్థం అయిందని… అందుకే ఆయనను తప్పించి ఆ స్థానంలో ప్రకాష్‌రాజ్‌ను తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
అయితే తాము మురళీమోహన్‌ను సినిమా నుంచి తప్పించడాన్ని ఆయన పర్సనల్‌గా తీసుకున్నారని… దీంతో ఇండస్ట్రీ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టడంతో పాటు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారని తేజ చెప్పారు. అయితే ఆ మొత్తాన్ని ఫిలింనగర్ దైవ సన్నిధి కి ఇవ్వాలని మురళీమోహన్ డిమాండ్ చేయగా… చివరికి ఇండస్ట్రీ పెద్దలు మధ్యవర్తిత్వం చేసి రు. 5 లక్షలు ( మురళీమోహన్ రు. 2 లక్షల రెమ్యునరేషన్ + తేజ ఇచ్చిన రు. 3 లక్షలు కలిపి) దైవ సన్నిధికి ఇచ్చేలా రాజీకుదిర్చారట. అయితే ఈ మొత్తం తేజ పేరు మీద కాకుండా మరో హీరో పేరుతో శిలాఫలకం మీద వేయించారని కూడా తేజ ఇంటర్వ్యూలో చెప్పారు.