సినీ ఇండస్ట్రీలోకి ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా..జనాలు మాత్రం కొంతమంది పాత హీరోయిన్లని మర్చిపోలేరు. వాళ్ళు సినిమాలు చేస్తున్నా..చేయకపోయినా..చేసింది కొన్ని సినిమాలే అయినా వాళ్ళను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అలాంటి వాళ్లల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు..మర్చి సినిమాలో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. వీళ్లిద్దరు చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ జనాల్లో ఇప్పటికి వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లు మళ్లీ సినిమాలోకి వస్తే చూడాలి అని అనుకునే వారు కూడా ఉన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరికి ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరు హీరోయిన్లు హ్యాపీ గా ఇష్టపడిన వారిని పెళ్లిచేసుకుని పిలలతో ఏంజాయ్ చేస్తున్నారు.
కాగా, టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ నటిగా మెరిసిన రిచా గంగోపాధ్యాయకి మంచి మంచి అవకాశాలు వస్తున్నప్పుడే ఆమె సినిమాలకి ఫుల్ స్టార్ పెట్టేసి ..విదేశాలకు వెళ్లిపోయింది. అయితే అప్పట్లో అంత కూడా చర్చించుకున్నారు. ఇంత సడెన్ గా అమ్మడు ఎందుకు సినిమాలకు బై బై చెప్పేసిందని. దీంతో ఆమె చదువుకోవాలనే ఇలా చేసింది అని అనుకున్నారు. కానీ, తెర పైకి ఓ సంచలన మ్యాటర్ లీక్ అయ్యింది. అమ్మడుని ఓ స్టార్ హీరో మోసం చేశాడట. అందుకే ఉన్న పలంగా సినిమాలకు దూరంగా వెళ్లి పోయిందట. ఈ క్రమంలోనే ఆమె ఉన్నత విద్య కోసం వాషింగ్టన్ వెళ్లిందనే విధంగా వార్తలు వచ్చాయి.
ఓ సమయంలో తెలుగు ప్రేక్షకులకు కొత్త అందాన్ని పరిచయం చేసిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైంలోనే బడా బడా నటులతో నటించి మంచి పేరు తెచ్చుకుంది. చూడటానికి బబ్లీగా ఉన్నా..చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయాయి ఆమె అందాలు. అయితే తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..అమ్మడు తాను హీరోయిన్ గా నటించిన సినిమా హీరోతోనే ప్రేమలో పడిందని. ఇక ఆ హీరో కూడా రిచా ను లవ్ చేశాడట. ఎలాగో ప్రేమించుకుంటున్నాం గా త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాము అని మ్యాటర్ కమిట్ అయిపోయారట.
సీన్ కట్ చేస్తే..మోజు తీరిపోయాక ఆ హీరో అమ్మడుని దూరం పెట్టాడు. పెళ్ళి మ్యాటర్ ఎత్తితేనే నీ ఫేస్ కి నేను కావాలా..ఇండస్ట్రీలో నా ఫ్యామిలీ రేంజ్ తెలుసా..అంటూ చీప్ గా మాట్లాడాడట. ఈ విషయం ఎవ్వరికి చెప్ప్దామన్నా కూడా ఆ హీరో బడా ఫ్యామిలీ నుండి రావడంతో తన మాట నమ్మరని .. తప్పు చేశానని..ఇక సినిమాలు వద్దు అనుకుని..చదువు పేరుతో ఇందస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని..ఓ బేబీ తో హ్యాపీ ఉంది.