సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తమన్నా రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. మిల్కీబ్యూటీగా మాంచి పాపులారిటీ తెచ్చుకున్న సమంత తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకానొక టైంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ప్రతి యంగ్ హీరో తమన్నాతో ఒక్క సినిమా అయినా చేయాలనేంతగా ఆమె వెలిగిపోయింది. అయితే ఇప్పుడు తమన్నా వయస్సు మూడున్నర పదులకు చేరువ అయ్యింది. ఆమె ముదురు ముద్దుగుమ్మ అయిపోయింది.
అయితే ఇప్పుడు ఆమె వెంకటేష్, చిరంజీవి లాంటి ముదురు హీరోలకు కూడా బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది. ఇక తమన్నా నటించిన ఎఫ్ 3 సినిమాతో పాటు గుర్తుందా శీతాకాలం త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఇప్పటికే చిరు పక్కన సైరాలో చిన్న రోల్ పోషించిన తమన్నా.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌గానే చేస్తోంది.
ఇటు సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా తమన్నా మాత్రమే ఉండడంతో.. ఇప్పుడు ఆమె రేటు విషయంలో కొండెక్కి కూర్చొంటోంది. ఆమె తాను అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానన్న కండీషన్లు పెడుతుండడంతో సీనియర్ హీరోలు ఆమె అడిగినంత ఇచ్చి ఆమెనే ఓకే చేసుకోక తప్పని పరిస్థితి. దీనిని తమన్నా బాగా క్యాష్ చేసుకుంటోంది. తాజాగా ఆమె బబ్లీ బౌన్సర్ అనే పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పింది.
పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాలో నటించేందుకు ఆమె ఏకంగా రు. 4 కోట్లు డిమాండ్ చేసిందట. ఒక్క సినిమాకు రు. 4 కోట్లు.. అది కూడా ఈ వయస్సులో అంటే తమన్నా మామూలు రేటు చెప్పలేదనే అనాలి. తమన్నా మామూలు రెమ్యునరేషన్ కంటే ఇది డబుల్ అనే చెప్పాలి. మధుర బండార్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఓ మహిళా బౌన్సర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది.