స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 2020 సంక్రాంతికి మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీపడి మరీ రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బీట్ చేసేసింది. బన్నీ – త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫ్రేమ్‌ను చాలా నీట్‌గా తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్.
ఈ సినిమాలో టబు వాళ్లు ఉండే ఇంటి పేరు అలవైకుంఠపురములో..! ఈ ఇంటి పేరుమీదుగానే సినిమాకు ఆ టైటిల్ పెట్టారు. సినిమా కథ అంతా ఆ ఇంటిని బేస్ చేసుకునే నడుస్తుంది. అందుకే కరెక్టుగా యాప్ట్ అయ్యేలా త్రివిక్రమ్ ఆ పేరు పెట్టాడు. ఇక సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సినిమాలో చూపించిన ఈ ఇళ్లు ఎంత పెద్దగా, విశాలంగా ఉందో చూశాం. థియేటర్లో తెరమీద చూస్తుంటూనే కళ్లు జిగేల్‌మనిపించింది. ఇక నిజంగా అంత పెద్ద ఇంటిని చూస్తే వావ్ అనాల్సిందే..!
ఇంతకు ఈ ఇళ్లు ఓ సెలబ్రిటీది.. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు..! ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి అల్లుడి ఇల్లు. ఎన్టీవీ చౌదరి కుమార్తె పేరు రచన చౌదరి. ఎన్టీవీ, భక్తీ టీవీ, వనితా టీవీ అన్నీ కూడా రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీదే ఉంటాయి. ఈ అల వైకుంఠపురములో సినిమాలో చూసిన ఇళ్లు రచనా చౌదరి, ఆమె భర్తది. ఆమె భర్త పేరు సబినేని విష్ణు తేజ. నరేంద్ర చౌదరి కుటుంబం.. హారిక, హాసిని వాళ్లు బంధువులు అవుతారు.
ఆ బంధుత్వంతోనే ఈ సినిమాలో ఆ ఇళ్లును వాడుకునే అవకాశం లభించింది. త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమాలో నదియా ఇంటి సెట్‌ను రామోజీ ఫిల్మ్‌సిటీలో వేశారు. అయితే అల వైకుంఠపురములో సినిమా కోసం కూడా ముందుగా ఫిల్మ్‌సిటీలోనే సెట్ వేయాలని అనుకున్నారు. చివరకు విదేశాల్లో కూడా కొన్ని ఇళ్లు చూశారు.. అవేవి నచ్చలేదు. ఫైనల్‌గా త్రివిక్రమ్‌కు ఈ ఇళ్లు నచ్చడంతో అది కావాలని రిక్వెస్ట్ చేశారట. దీంతో ఈ ఇంట్లో 20 రోజులు షూటింగ్ చేసుకునేందుకు విష్ణు ఓకే చెప్పడంతో అల వైకుంఠపురంలో సినిమాలో ఈ ఇళ్లు చూసే ఛాన్స్ ప్రేక్షకులకు దక్కింది. ఇక ఇంటి ఖరీదు రు. 20 కోట్లకు పైనే ఉంటుందట.