Moviesసమంత కొత్త ఫ్రెండ్‌..అప్పుడే అంత క్లోజ్‌గా..మ్యాటర్ చాలా దూరం వెళ్లిన్నట్లుందే..!!

సమంత కొత్త ఫ్రెండ్‌..అప్పుడే అంత క్లోజ్‌గా..మ్యాటర్ చాలా దూరం వెళ్లిన్నట్లుందే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా..ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేస్తుందని ఆమె తీసుకునే నిర్ణయాలు చాలా పర్ ఫేక్ట్ గా ఉంటాయని చెబుతుంటారు ఆమె సన్నిహితులు. ఇక నాగ చైతన్య తో విడాకులు తీసుకోవాలని అని డిసైడ్ అయ్యాక అమ్మడు ఏమాత్రం టైం వేస్ట్ చేయడం లేదు. సమయం దొరికిన్నప్పుడల్లా టూర్ లు. కొంచెం టై దొరికిన సోషల్ మీడియాలో కాంట్రవర్షీయల్ పోస్ట్ లు.. కుదిరితే పుణ్యక్షేత్రాలు..కుదరకపోతే బికినీతో హాట్ యోగాసనాలు..చేస్తూ బిజీ బిజీ గా గడిపేస్తుంది.

ఇక మనలో చాలామందికి తెలిసిందే సమంత కు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎక్కువని. కానీ, బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం ఇద్దరే. సమంతకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఒకరు నీరజ కోన.. మరొకరు శిల్పా రెడ్డి. ఎక్కడికి వెళ్లినా కూడా వీళ్ళతోనే వెళ్తుంది సామ్. మిగతా వాళ్లతో బాగా మాత్ళాడుతుంది. కానీ అన్నీ విషయాలు షేర్ చేసుకోలేదు. కానీ, వీళ్లతో మనసు విప్పి అన్నీ విషయాలు మాట్లాడుకుంటుంది. అన్ని బాధలను షేర్ చేసుకుంటుంది. ఇక సమంత బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి తాజాగా మరో స్టార్ డాటర్ లేడీ విలన్ కూడా వచ్చి చేరింది.

ఆమెవరో కాదు.. వరలక్ష్మి శరత్ కుమార్. తనదైన స్టైల్ లో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా గడిపేస్తుంది ఈ జయమ్మ. ప్రస్తుతం యశోద సినిమాలో సమంత తో పాటు మరో కీలక రోల్ లో యాక్టర్ వరలక్ష్మి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్‌లో బాగా క్లోజ్ అయిపోయారు సామ్-వరలక్ష్మి. ఇక ఇప్పుడు ఎక్కడకు వెళ్ళినా కలిసే ఉంటున్నారు ఈ ఇద్దరూ. షాపింగ్ లకు,టూర్లకు సమంతతోపాటు వరలక్ష్మి కూడా వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇక వాళ్ళు పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే..వీళ్లు ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు మనకు తెలుస్తుంది. ఇక దీంతో సమంత ఫ్యాన్స్.. సమంతకు మరో మంచి ఫ్రెండ్ దొరికినట్లే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అప్పుడే అంత క్లోజ్ గా కలిసిపోయారా..గుడ్..అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news