స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది. నాలుగైదేళ్లుగా సమంత సోషల్ మీడియాలో తన ప్రతి అప్డేట్తో పాటు హాట్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఇక చైతుతో విడాకుల ముందు నుంచే ఆమె వేదాంత ధోరణితో కూడిన కొటేషన్లు కూడా పోస్ట్ చేస్తూ వస్తోంది. చైతుతో విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోంది.
సమంత ఎప్పటికప్పుడు తన ఇంట్రస్టింగ్ విషయాలు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. పెళ్లయ్యి విడాకులు తీసుకున్నాక కూడా సమంత యంగ్ జనరేషన్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇక టాలీవుడ్ ఆఫర్లతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్లో కూడా వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. బాలీవుడ్లో ఇప్పటికే రెండు హాట్ వెబ్ సీరిస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సమంత కోలీవుడ్‌లో క్రేజీ హీరో కార్తీ పక్కన మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పింది.
టాలీవుడ్లో గుణశేఖర్ శాకుంతలంతో పాటు యశోద సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక హాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేసేందుకు ఆడిషన్ కూడా చేసింది. తాజాగా సమంత క్రమశిక్షణ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పింది. క్రమశిక్షణ మనలను బలంగా తయారు చేయడంలో ఓ ఆయుధంగా ఉపయోగపడుతుందని చెప్పింది. క్రమశిక్షణ వల్ల ఒక్కోసారి తాత్కాలిక ఆనందానికి దూరం అవుతామని.. అయితే భవిష్యత్తులో మాత్రం మంచి ఫలితాలే వస్తాయని చెప్పింది.
ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే క్రమశిక్షణ అనేది బలమైన పునాది అని చెప్పింది. ఇలా ఉండడం ద్వారానే మనం కోరుకున్నవి అన్నీ దక్కుతాయని కూడా ఆమె తెలిపింది. ఏదేమైనా సమంతలో చైతుతో విడాకుల తర్వాత వేదాంతం బాగా పెరిగినట్టే ఉంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తర్వాత ఆమె నటన విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గనని ఫ్రూవ్ చేసుకుంది.