సినిమా ఇండస్ట్రీలోకి రావడమే పెద్ద సాహసం. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చినా సరైన సినిమా అవకాశాలు వస్తాయని నమ్మకం లేదు. ఒక్కవేళ వచ్చినా..ఆ మన పాత్ర హైలెట్ అవ్వాలని లేదు. అలా అవ్వాలి అంటే బోలెడు అంత అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టవంతులు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో ఒక్కడు ఈ రాహుల్ రామకృష్ణ. తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇదే.
ఈ మధ్య కాలంలో ట్యాలెంటెడ్ యువ నటులు చాలా మంది వచ్చారు. అందులో రాహుల్ రామకృష్ణ ఒకరు. తరుణ్ భాస్కర్ చేసిన షార్ట్ ఫిలింలో ‘సైన్మా’లో లీడ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండకి ఫ్రెండ్ గా నటించి.. తనదైన స్టైల్ లో మాట్లాడుతూ అందరి అటెంక్షన్ గ్రాబ్ చేసుకున్నాడు.
ఆ తర్వాత మంచి మంచి సినిమాలల్లో అవకాశాలు అందుకుంటూ.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. కమెడియన్ గానే కాక మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. ఈయన తెర పండించే కామెడీ అంటే చాలా మందికి ఇష్టం.
అయితే, కొంత కాలం టాలీవుడ్ లో నటుడిగా ఏలేస్తాడు అనుకున్న ఈయన తన అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సినిమాల్లో ఎన్నో అవకాశాలు అందుకుంటోన్న ఆయన ఈ సమయంలో నటనకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక పై తాను సినిమాల్లో నటించనని తెలిపారు.
2022 వరకు మాత్రమే తాను సినిమాల్లో నటిస్తానని.. ఆ తర్వాత నటనకు దూరం అవుతానని రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. దీంతో రాహుల్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. రాహుల్ రామకృష్ణ ట్వీట్‌పై నెటిజన్స్ పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అంతలేదు లే బ్రో కామెడీలు చేయకు అంటుంటే.. ‘ఏదో ప్రమోషన్ అనుకుంటా.. అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. సడెన్ గా రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటని సోషల్ మీడియా వేదికగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
2022 is my last.
I will not do films anymore.
Not that I care, nor should anybody care— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022