ప్రస్తుతం అందరి నోట నానుతున్న ఒక్కే ఒక్క పాట “ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ సినిమాలోని ఈ పాట కేవలం తెలుగు రాష్ట్రలల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో తెలియాలంటే ఓ సారి యూట్యూబ్ లోకి వెళ్లి సెర్చ్ చేస్తే కొన్ని వేల కవర్ సాంగ్స్..ఫనీ రీల్స్ కనిపిస్తాయి. అంతలా ఈ పాట జనాలకు రీచ్ అయ్యింది. డిసెంబరు 17న విడుదలై పుష్ప మూవీ ఎంటటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి కలెక్షన్స్ పరంగా మాత్రం బన్నీ ఎక్కడ తగ్గెదేలే అంటూ చెలరేగిపోయాడు.
ఇక ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత తన కెరీర్ లోనే ఎప్పుడు చేయని ఐటెం సాంగ్ చేసి..సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ పాటకు సమంత అందం , సింగర్ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్, దేవీ ట్యూన్ అన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యాయి. దీంతో పాట బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల అవ్వడంతో ఈ ఐటెం సాంగ్ కూడా ఐదు భాషల్లో రిలీజ్ చేసారు మేకర్స్.అయితే నిజం చెప్పాలంటే ఈ ఊ అంటావా పాట తెలుగులో హిట్ అయ్యిన్నట్లు..మిగతా భాషల్లో హిట్ అవ్వలేదు. తెలుగులో ఈ పాట పాడిన ఇంద్రావతి వాయిస్ మిగతా భాషల్లో పడిన సింగర్స్ వాయిస్ కి సెట్ అవ్వలేదు.
అయితే ఈ పాటను హీందీలో పాడిన కనికా కపూర్ రీఎంట్ గా “ఊ బోలేగా” సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ పాట పాడిన తరువాత తన దగ్గర బంధువులు ఫోన్ చేసి..” నువ్వు ఏమి అనుకోకపోతే ఓ విషయం చెప్తాను. ఈ పాట మాకు నచ్చలేదు”అని చెప్పారట. అంతేకాదు చాలా మంది ఫ్యాన్స్ మిగతావారు కూడా ఈ పాట ఎందుకో మాకు అంతగా నచ్చలేదని ఫీడ్ బ్యాక్ ఇస్తూ కాల్స్ , మెసేజెస్ వచ్చాయట. కానీ అవి నేను పట్టించుకోలేదని..పాట హిట్ అయ్యాక ఇలాంటి పెద్దగా కేర్ చేయనని చెప్పుకొచ్చింది సింగర్. ప్రస్తుతం అమ్మడు మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.