Moviesఆ విషయంలో తమన్నా మనసు మార్చుకుందట..ఇక డైరెక్టర్స్ కు పండగేగా..?

ఆ విషయంలో తమన్నా మనసు మార్చుకుందట..ఇక డైరెక్టర్స్ కు పండగేగా..?

అప్పుడేపుడో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీ డేస్ చిత్రంతో తెర పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మా..నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో కొనసాగిన..తెర పైకి కొత్త అందాలు రావడంతో తమన్నా అందాలు పాత పడ్డాయి. దీంతో ప్రస్తుతం తమన్నా హవా సినీ ఇండస్ట్రీలో తగ్గిందనే చెప్పాలి. ఒక్కప్పుడు క్షనం కూడా తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తు.. అటు స్టార్ హీరోలతోను..ఇటు కుర్ర హీరోలతోను చిందులేసిన ఈ మిల్కీ బ్యూటీని..ఇప్పుడు టాప్ హీరోలు పట్టించుకోవడమే మానేసారు. ఈ రంగుల ప్రపంచం లో అంతే..కొత్త హీరోయిన్స్ అందలు ఆరబోస్తున్నప్పుడు.. పాత అందాలు ఆడియన్స్ కి అంతగా కంటికి ఆనవుగా.

అయితే ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా గని సినిమాలో మెగా వరసుడితో ఐటెం సాంగ్ కు చిందులు వేయనుంది. ఎఫ్‌ 3 మూవీలో వెంకటేష్ సరసన నటిస్తుంది. ఇవి తప్పిస్తే అమ్మడు ఖాతాలో పెద్దగా చెప్పుకోతగిన ఆఫర్లు లేవు. దీంతో అందరు తమన్నా ఇకనైనా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందని అనుకున్నారు. కానీ వాళ్ల ఊహలను తలకిందులు చేస్తూ..తమన్నా రీసెంట్ ఇంటర్వ్యుల్లో షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో డైరెక్టర్స్ హ్యాపీగా ఉన్నా ఆమె పెళ్లి చేసుకుంటే చూడాలి అని భావించిన ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు.

అనుకోని విధంగా అమ్మడుకి పలు సినిమాలో వెబ్ సిరిస్ లో అవకాశాలు రావడంతో ఆమె పెళ్ళి విషయంలో యూటర్న్ తీసుకుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లికి మరో రెండు మూడు సంవత్సరాల సమయం కావాలి అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు మరియు వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి. కనుక ఈ సమయంలో సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకోవడం అవివేకం అవుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమయం వచ్చినప్పుడు.. అన్ని సవ్యంగా కొనసాగుతాయని మిల్కీ బ్యూటీ తమన్నా వెల్లడించింది. మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్‌ సినిమాతో పాటు రెండు కన్నడ సినిమాల్లోనూ నటిస్తుంది తమన్నా. దటీజ్‌ మహాలక్ష్మి, ఎఫ్‌ 3, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో తమన్నా నటిస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news