సీనియర్ హీరో జగపతిబాబు ఇప్పుడు ఫుల్ బిజీ. గతంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. విలన్‌గా, తండ్రిగా, మామగా ఇలా ఎన్నో రకాల పాత్రలు వేస్తున్నారు. తాజాగా వచ్చిన అఖండ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించారు. ఒక్క తెలుగులో మాత్రమే కాదు తమిళ్, మళయాళంలో కూడా ఇప్పుడు ఆయన బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఈ క్రమంలోనే జగపతిబాబు తన తాజా ఇంటర్వ్యూలో తెలుగులో స్టార్ క్రేజీ హీరోల గురించి తన అభిప్రాయం చెప్పారు.
ఓ సీనియర్ హీరోగా జగపతిబాబును ఇప్పుడు ఉన్న క్రేజీ యంగ్ హీరోలు అందరూ గౌరవిస్తారు. వీళ్లందరితోనూ ఆయన సినిమాలు చేశారు. యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పిన జగపతిబాబు తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రభాస్ బంగారం అని.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ప్రభాస్ అని జగపతిబాబు చెప్పాడు.
ఇక తాను మహేష్‌తో రెండు సినిమాలు చేశానని.. ఎక్కువ ఇంటరాక్షన్ లేదని.. అయితే సెట్స్‌లో చాలా సరదాగా ఉంటాడని.. ఎవ్వరిని వదలకుండా అందరిమీదా సెటైర్లు వేస్తూ ఉంటాడని చెప్పాడు. ఇక ఎన్టీఆర్ గురించి చెపుతూ తనో పెద్ద కోతి అని… ఇప్పుడు కాస్త తగ్గించినట్టు ఉన్నాడు.. కొంచెం మెచ్యూర్ అయ్యాడు.. విపరీతమైన అల్లరి చేస్తాడంటూ జగపతిబాబు చెప్పాడు.
ఇక బన్నీ గురించి చెపుతూ .. తాను ఇప్పటి వరకు బన్నీతో సినిమా చేయలేదని.. అయితే బన్నీ తనను తాను మలుచుకున్న తీరు తనకు నచ్చుతుందని చెప్పాడు. బన్నీ చాలా బాగా కష్టపడతాడు అని.. ఓ సారి తనను జిమ్‌లో చూశానని.. తన వర్కవుట్స్ చూస్తే చాలా హార్డ్ వర్కర్ అనిపించిందని చెప్పాడు. ఇక పవన్‌తో తనకు పెద్దగా పరిచయం లేదని.. కానీ ఆయనంటే తనకు ఇష్టమే అని చెప్పాడు.
ఇక దర్శకుడు కృష్ణవంశీ, తాను చాలా క్లోజ్ అని… తామిద్దరం డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఓ సారి రోడ్డుమీద కలుసుకున్నాం అని… ఆ టైంలో ఇద్దరం మందు కొట్టేసి ఉన్నాం… బోర్ కొడుతూ ఉండడంతో ఏం చేయాలా ? అనుకుని తాను రోడ్డుమీదే డ్యాన్సులు వేశానని.. పోలీసులు చూసినా ఏమీ అనకుండా వదిలేశారని …. తాను ఎప్పుడూ ఎలా ఉండాలో అలాగే ఉండాలని అనుకుంటానని.. లైఫ్‌ను అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటానని జగపతి చెప్పాడు.