రాహుల్ రవీంద్రన్..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసి అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. మరికొన్ని సినిమాల్లో ఈయన నటించినా ఆయన పాత్రకు పెద్దగా పేరు లేదు. అప్పుడెప్పుడో అందాల రాక్షసి సినిమా.. మొన్న వచ్చిన శ్యాం సింగరాయ్ మూవీ ఈ రెండు సినిమాల్లో తప్పిస్తే ఆయనకి వేరేసినిమాల్లో నటించిన పెద్ద పేరు రాలేదు.
మహేష్ బాబు శ్రిమంతుడు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేసిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోళేదు. ఈయన నటుడిగా, డైరెక్టర్ గా కంటే కూడా స్టార్ సింగర్ చిన్మయి భర్త గానే అందరికి గుర్తుండిపోయాడు. ఇక సింగర్ చిన్మయి ద్వారా..మెల్లగా సమంత తో ఫ్రెండ్ షిప్ చేసి..ఇప్పుడు జాన్ జిగిడి దోస్త్లు అయిపోయారు. చిన్మయి సమంతకు వాయిస్ డబ్బింగ్ చెప్పుతుందన్న సంగతి తెలిసిందే.
ఇండస్ట్రీలోని చాలా తక్కువమందితో స్నేహంగా మెదిలే సామ్.. తన స్నేహితురాలు చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ చాలా సన్నిహితంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ లతో దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ ‘నువ్వు లేకుంటే నేనేమి చేయగలను?’ అని కామెంట్ పెట్టడమే గాక దానిపై లవ్ సింబల్ పెట్టేసింది సమంత. ఈ ఫొటో నెట్టింట ఎంత వైరల్ గా మారిందో కూడా మనం చూసాం.
ఇక ఇప్పుడు ఈ ఫ్లాప్ డైరెక్టర్ రాహుల్ తో సినిమా చెయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రష్మిక. దీంతో అభిమానులు ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇలాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా తీస్తెస్ నీ కెరీర్ నాశనం అవుతుంది చేయకు అంటు సజీషన్స్ ఇస్తున్నారు.త్వరలోనే అమ్మడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇకఈ సినిమాను సమంత స్నేహితుడు.. డైరెక్టర్, నటుడు అయిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి రష్మిక సినిమాతో అయినా రాహుల్ డైరెక్టర్గా సక్సెస్ సాధిస్తారా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.