సమంత అప్పుడు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. నాగచైతన్యకు విడాకులు ఇవ్వకముందు భర్తతో కలిసి ఎక్కడ చూసినా అల్లరి అల్లరి చేసేది. చైతు – సమంత ఏం చేసినా పెద్ద సంచలనమే అయ్యేది. ఇక వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చాక, సమంత తన సోషల్ మీడియా అక్కౌంట్ల నుంచి అక్కినేని పేరు తీసేశాక కూడా ఆమె వార్తల్లో ఉంది. ఇక చైతుకు విడాకులు ఇచ్చాక మరింత స్వేచ్ఛా పక్షి అయిపోయింది. అటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు, ఇటు వెబ్ సీరిస్‌లు మరోవైపు విహార యాత్రలు, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్లు సమంత అస్సలు ఖాళీగా ఉన్నట్టు లేదు.
ఇక సమంత ఎప్పుడు ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువే. ఇదిలా ఉంటే తాజాగా సమంత పర్సనల్ లైఫ్ గురించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ తన బిజీ లైఫ్‌లో ఏం చేస్తుంటుంది ? ఏం తింటుంది ? అన్నవి కూడా ఇప్పుడు ఎక్కువుగా సెర్చ్ చేస్తున్నారు. ఈ విషయాలు కూడా సమంత తన అభిమానులతో పంచుకుంటోంది.
సమంత ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తుంది. ఆ తర్వాత ఆ రోజంతా ఏం చేయాలి ? అనే విషయంపై ఆలోచనతో ప్లాన్ చేసుకుంటుందట. ఆ తర్వాత వరుస క్రమంలో ఏయే పనులు చేయాలో ఆ పనులను మొదలు పెడుతుందట. ఇక సమంత ఆహారంలో ఎక్కువుగా మొక్కల అధారిత ఐటెంలు ఎక్కువుగా ఉండాలట.
ఇక అందానికి ఎక్కువుగా ఇంపార్టెన్స్ ఇచ్చే సమంత.. తాను తీసుకునే ఆహారం కూడా అందుకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇక ఫిట్‌నెస్ విషయంలో మాత్రం సమంత ఏ మాత్రం రాజీపడదు. ప్రతి రోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. ఏ షూటింగ్ ఉన్నా కూడా గంట పాటు జిమ్‌లో కసరత్తులు చేయాల్సిందే. ఇక అందుకు తగినట్టుగానే నీరు కూడా ఎక్కువుగా తాగుతుందట. ఇక తాను ఎప్పుడూ నిరాశ చెందను అన్న ధోరణితో సమంత ఉంటుంది. తాను తనతో మాత్రమే పోటీ పడతానని సమంత చెపుతూ ఉంటుంది.