Moviesసోష‌ల్ మీడియాను షేక్ చేస్తోన్న ఎన్టీఆర్ న్యూ లుక్‌...!

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోన్న ఎన్టీఆర్ న్యూ లుక్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఎన్టీఆర్ చాలా డైనమిక్ స్టైల్లో దర్శనం ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా వాయిదా ప‌డ‌డంతో కాస్త రిలీక్స్ అయ్యాడు. ప్ర‌స్తుతం పండ‌గను ఎంజాయ్ చేస్తోన్న మ‌నోడు త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్ లో బిజీ కానున్నాడు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.

అయితే తాజాగా తారక్ స్టైలిస్ట్ అశ్విన్ ఎన్టీఆర్ కొత్త పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడది బాగా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ నలుపు రంగు సూట్ ధరించి చాలా కాన్ఫిడెంట్ గా చూస్తూ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే ఆయన మీసాలు కోర వంపు తిరిగి ఉన్నాయి. తన కలర్ కు సూట్ అయ్యే సూట్‌తో పాటు టై ధ‌రించి బూట్లు వేసి క్లాసిక్ లుక్‌తో చంపేశాడు.

చాలా రాయల్ గా ఉన్న ఈ లుక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది. ఇక ఎన్టీఆర్ సినిమాల‌ విషయానికి వస్తే టాలీవుడ్లో క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన త్రిబుల్ ఆర్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాను సమ్మర్ కు వాయిదా వేశారు. ఇక కొరటాల శివ సినిమా తర్వాత వ‌రుస పెట్టి క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ఇక ఎన్టీఆర్ కొత్త రాయ‌ల్ లుక్‌పై మీరు కూడా ఓ క‌న్నేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news