Moviesచాలా హ్యాపీగా ఉన్నా.. ప్రెగ్నెన్సీ పై సమంత సంచలన వ్యాఖ్యలు..!!

చాలా హ్యాపీగా ఉన్నా.. ప్రెగ్నెన్సీ పై సమంత సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఉన్నటువంటి అక్కినేని వారసుడు నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ సినీ పరిశ్రమే కాదు అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ రెండు ఇండస్ట్రీలోని ప్రజలు షాక్ అయ్యారు. ఎంతో చూడ ముచ్చటైన ఈ జంటకు అస్సలు విడిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ అనుకున్నారు. కొందరైతే విడిపోకండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ వీళ్లు మాత్రం విడాకుల మ్యాటర్ నుండి వెనకు తగ్గడలేదు. రీజన్ ఏంటో తెలియదు కానీ మొత్తాని తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేయడానికి ఫిక్స్ అయిపోయారు. దీంతో సమంత నాగ చైతన్య మాజీ మొగుడు పెళ్లాలు కాబోతున్నారు. ఇక ఈ విషయంలో పెద్ద దిక్కు నాగార్జున సైతం ఏం చేయ లేక చేతులు ఎత్తేశారు అన్న టాక్ వినిపిస్తుంది.

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత ..అస్సలు అక్కినేని కుటుంబం గురిచి కానీ, చై గురించి కానీ ఎక్కడ మాట్లాడటం లేదు. ప్రతి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక్క పోస్ట్ పెడుతూ వచ్చే ఈ అమ్మడు వచ్చిన సినిమాలను అన్నింటిని సైన్ చేసుకుంటుపోతుంది. విడాకుల తరువాత సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే సమంత రీసెంట్ గా ప్రెగ్నెన్సీ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. దీంతో అమ్మడు మరో నెట్టింట సెన్సేషన్ గా మారింది.

టాలీవుడ్ చందమామ కాజల్ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. చిన్న నాటి స్నేహితుడు గౌతం కిచ్లు ని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఈ ఏడాదిలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. ఇక ఇదే విషయాని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో ఆమెకు అభిమానులతోపాటు..పలువురు బడా సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే సమంతకూడా కాజల్ కి విషెస్ చెప్పింది. సమంత పోస్ట్ చేస్తూ..”క్యూట్ గా మెరిసి పోతున్నావు కాజల్.. నా నుంచి నీకు ఎప్పుడూ లాట్స్ ఆఫ్ లవ్ ఉంటుంది ..డియర్ ..అమ్మగా మారుతున్న … నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది అంటూ సమంత కామెంట్ పెట్టింది. ఇక ఈ మెసేక్ కి రిప్లై ఇస్తూ కాజల్ స్పందిస్తూ…”థాంక్ యూ మై డియరెస్ట్ సామ్” అన్ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news