టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన త్రిఫుల్ ఆర్ మూవీ వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో ఈ నెల 7వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఒమిక్రాన్ దెబ్బతో పాటు చాలా చోట్ల థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడం.. మరోవైపు ఏపీలో టిక్కెట్ల సమస్య నేపథ్యంలో తప్పక వాయిదా వేశారు. అయితే గత నెల రోజులుగా ఈ సినిమా ప్రమోషన్లు మాత్రం అదిరిపోయాయి. ప్రమోషన్లకే రు. 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు టాక్ ?
బాలీవుడ్‌లోనూ త్రిఫుల్ ఆర్ ప్రమోషన్లు గట్టిగా చేశారు. కండల వీరుడు సల్మాన్ హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ షోలోకి వెళ్లిన ఈ సినిమా టీం బాలీవుడ్లోపే ఫేమస్ షోగా పేరున్న ది కపిల్‌శర్మ షోలోనూ పాల్గొంది. ఈ షోలో రాజమౌళితో పాటు రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఆలియాభట్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కపిల్‌శర్మ ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. 2003 డిసెంబర్లో కృష్ణా జిల్లా నిమ్మకూరులో జరిగిన ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్‌కు లక్షలాది మంది హాజరైన తీరు.. అప్పుడు ఎన్టీఆర్ ఆ లక్షలాది జనాలను హ్యాండిల్ చేసిన తీరు గురించి కపిల్‌శర్మ చాలా గొప్పగా పొగిడారు.
ఎంత ఎదిగినా అంతగా ఒదిగి ఉండే ఎన్టీఆర్ మాటలు ఇటు సౌత్ ఇండియన్స్‌తో పాటు అటు నార్త్ ఇండియన్స్‌ను కూడా ఫిదా చేస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ షోలో నవ్వులు పూయిస్తూనే ఉత్తరాది ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం కూడా ఆసక్తికరం. ఈ షో సూపర్ హిట్ అవ్వడంతో పాటు నెట్టింట్లో కూడా వైరల్ అవుతోంది. ఈ షోలో ఎన్టీఆర్ స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ ఎన్టీఆర్ మాటల్లో గొప్ప నిజాయితీ ఉందని కామెంట్లు చేస్తున్నారు.
ఇక కపిల్‌శర్మ సైతం ఆంధ్రావాలా ఈవెంట్ ప్రస్తావన వచ్చినప్పుడు ఇతడేనా ఆ లక్షలాది మంది ప్రేక్షకులను హ్యాండిల్ చేసింది అని తలచుకుంటే తనకు చాలా ఆశ్చర్యం వేసిందని చెప్పాడు. సింహాద్రి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్‌కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌తోనే ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్‌కు ఏకంగా 10 లక్షల మంది అభిమానులు తరలి వచ్చారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది.