టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న అక్కినేని నాగార్జున తన మూడున్నర దశాబ్దాల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో రొమాంటిక్ బాయ్ గా కనిపించినా నాగార్జున శివ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా కనిపించాడు. అలాగే అన్నమయ్య – శ్రీరామదాసు లాంటి భక్తిరస పాత్రలలో అలా ఒదిగిపోయిన నాగార్జున మజ్ను సినిమాలో ఓ భగ్న ప్రేమికుడిగా చేశాడు. క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోయి జీవించడం నాగార్జునకు వెన్నతో పెట్టిన విద్య.
సీనియర్ హీరోగా ఉన్న నాగార్జున మల్టీస్టారర్ సినిమాలలో కూడా నటిస్తున్నాడు. గతంలో నేచురల్ స్టార్ నానితో కలిసి దేవదాస్ సినిమాలో నటించాడు. అలాగే కోలీవుడ్ హీరో కార్తీతో కలిసి ఊపిరి సినిమా చేశాడు. నానీతో నాగార్జున కలిసి నటించిన దేవదాసు సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎప్పుడు తాగుతూ ఉండే పాత్రలో కనిపించాడు.
దేవదాస్ తరహాలో ఉండే ఈ పాత్రలో జీవించేందుకు నాగార్జున సెట్లోనే మందు తాగడానికి అలవాటు పడ్డాడట. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రతిరోజు సాయంత్రం రెండు సిప్‌లు తాగుతూ వచ్చాడట. అలా చివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే సరికి నాగార్జున పూర్తిగా మద్యానికి బానిస అయిపోయాడు. అయితే తాను ఆ అలవాటు నుంచి బయటపడేందుకు కొద్ది రోజులు పట్టిందని… దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకుని ఆ వ్యసనం నుంచి బయట పడ్డాను అని నాగార్జున తెలిపారు.
ఇక దేవదాస్ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. నాగార్జున వెండితెరతో పాటు ఇటు బుల్లితెర మీద కూడా బిజీ బిజీగా ఉంటున్నాడు. బిగ్‌బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉన్న నాగార్జున త్వరలోనే బంగార్రాజు, ఘోస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన బంగార్రాజు సంక్రాంతి తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది.