టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తోంది. చైతు నుంచి విడిపోయాక తన స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేస్తున్న ఆమె తాజాగా గోవా బీచ్ లో బికినీ వేసుకుని మరీ యోగా చేస్తోంది. ఈ ఫోటోలు… వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ? వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక సమంత ముందు నుంచి ఫిట్‌నెస్‌కు.. గ్లామర్ కు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఫిట్నెస్ విషయంలో కసరత్తులు చేసేందుకు ఆమె ఎక్కడా రాజీపడరు… ఆమె ఫిట్‌నెస్‌కు కూడా అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఆమె జిమ్‌లో కసరత్తులు చేసే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే… అభిమానుల నుంచి అదిరిపోయే కామెంట్లు వస్తుంటాయి.
సమంత సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ప్రతి రోజు జిమ్‌లో కనీసం గంట పాటు గడుపుతుంటుంది. మూడున్నర పదుల వయసుకు వచ్చినా కూడా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం వల్లే సమంతకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయని ఇండస్ట్రీ వాళ్ళు చెబుతూ ఉంటారు. తాజాగా సమంత తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తాను జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన సమంత చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు.
విచిత్రమేంటంటే తన ఫిట్నెస్ సీక్రెట్ సమోసా అని చెప్పిన సమంత… సమోసాలు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అయితే తనకు ఎంతో ఇష్టమైన సమోసాలను తినలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.
సమోసాను తన ఎదురుగా పెట్టుకుని తాను వర్కవుట్లు చేస్తున్నానని… ముందుగా శరీరంలో కేలరీలను కరిగిస్తానని… ఆ తర్వాతే సమోసా తింటాను అని చెప్పింది.సమోసాల కోసమే… తాను జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్లు చేస్తున్నానని చెప్పింది.
ఈ క్రమంలోనే ఆమె తన అభిమానులతో ఒక సామెత కూడా పంచుకుంది. మనం తినే ఫుడ్ పైన… మన శరీరం… ఆలోచనలు… మనసు ఆధారపడి ఉంటాయని ఆమె చెప్పింది. ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాతో పాటు యశోద, కాదు వాక్కు రెండు కాదల్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్లో ఓ బోల్డ్ వెబ్ సీరిస్‌కు ఓకే చెప్పింది.