ఇండస్ట్రీలో హీరోల మధ్య ఇగోల కన్నా వారి అభిమానుల మధ్య ఇగోలు మామూలుగా ఉండవు. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర వారి అభిమానులు చేసే హంగామాకు అంతే ఉండదు. ఎవరికి వారు తమ హీరో సినిమాయే హిట్ అని నానా రచ్చ చేస్తూ ఉంటారు. ఈ సంస్కృతి టాలీవుడ్‌లో గత నాలుగైదు దశాబ్దాల నుంచే ఉంది. తమ అభిమాన హీరోను ఎవరైనా ఏదైనా అంటే వారు అస్సలు తట్టుకోలేరు.
ఇక అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇక కొందరు హీరోలు తమకు ఉన్న అభిమానం నేపథ్యంలో ప్రమోగాత్మక సినిమాలు చేసేందుకు కూడా వెనుకాడుతూ ఉంటారు. ఇక సినిమాలో కూడా తమ అభిమాన హీరోకు అన్యాయం జరిగితే తట్టుకోలేని ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అప్పట్లో ఒక స్టార్ హీరోను హీరోయిన్ చెంపమీద కొడుతుంది.. ఆ సీన్ తట్టుకోలేని అభిమానులు ఆ హీరోయిన్ పోస్టర్లకు పేడ అంటించారు అంటే ఈ అభిమానం ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బాపు దర్శకత్వంలో కృష్ణ హీరోగా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమా వచ్చింది. ఇందులో జయప్రద హీరోయిన్. ఆ తర్వాత వీరి కాంబోలో కృష్ణావతారం సినిమా వచ్చి కమర్షియల్‌గా హిట్ కొట్టింది. ఈ సినిమాలో శ్రీదేవి టీ కొట్టు నడిపే యువతిగా నటించారు. మరో హీరోయిన్‌గా విజయశాంతి చేశారు. ఈ సినిమా టైంలో కృష్ణకు విపరీతమైన క్రేజ్ ఉండేది.
ఈ సినిమాలో ఒక పాత్ర కృష్ణను ఒరేయ్ వెధవ అని తిడుతూ ఉంటుంది. బాపు ఆ పాత్రను అలా డిజైన్ చేశారు. అయితే ఇది కృష్ణ అభిమానులను బాగా హర్ట్ చేసింది. చివరకు ఈ వివాదం బాపు మొడకు చుట్టుకుంది. ఆ తర్వాత కృష్ణను సినిమాలో తిట్టించినా కూడా ఆయన అభిమానులకు నచ్చదు అన్న విషయం బాపుకు అర్థమైందట.