మీమ్స్..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇవి ఎక్కువ అయిపోయాయి. కొన్నీ ఫన్నీగా ఉంటే మరికొన్ని మనుషుకను హర్ట్ చేసే విధంగా ఉంటాయి. ఇక ఇవే నేటి తరం యువత ఎక్కువగా ఫాలో అవుతుండడం గమనార్హం. ఈ రోజుల్లో సోషల్ మీడియాను మీమ్స్ మరో మెట్టు పైకెక్కిస్తున్నాయనే చెప్పాలి . ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో దానిపై ఫన్, సెటైర్, ట్రోల్స్ వంటివి సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా మీమ్స్ సెట్ చేసి నెట్టింట వదులుతున్నారు. ఇక మీమ్స్ ఎంత క్రియేటివ్‌గా చేస్తున్నారో మనకు తెలిసిన విషయమే. చాలా మంది క్రియేటర్లు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా చాలా ప్లాట్‌ఫామ్‌లలో రకరకాల మీమ్స్ వస్తున్నాయి.
మీమ్స్.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. చూడగానే నవ్వు వస్తుంది. కడుపు చెక్కలవుతుంది. ఓ చిన్న బొమ్మ దాని కింద రాసే అక్షరాలు.. ఎంతో అర్థాన్ని ఇస్తాయి. అంతేకాదు కామెడీ పూయిస్తాయి. చూసినోళ్లు నవ్వకుండా ఉండలేరు. అంతేనా.. ఏం క్రియేషన్ రా బాబూ అని మెచ్చుకోకుండా ఉండలేరు. నిజానికి వీటిని చేయడం అంత తేలిక కాదు. సరైన ఫొటోలు వెతకాలి, సరైన క్యాప్షన్ పెట్టాలి, ఫొటోషాప్ ఎడిటింగ్ చెయ్యాలి… ఇలా ఎంతో రిస్కుతో కూడిన పని.
అయినప్పటికీ… తమ కష్టాన్ని బయటకు తెలియనివ్వకుండా… ఫన్నీ మీమ్స్ అందించి అందరికీ ఆనందాన్ని పంచుతున్నారు. ఈ మీమ్స్ వల్ల సరదాగా కాసేపు నవ్వుకునే వాళ్లు ఉన్నారు. ఇక ఇలాంటి చెత్త మీమ్స్ నా చేసేది అంటూ తిట్టుకునేవారు ఉన్నారు, సోషల్ మీడియా అంటెనే అటు చెడు ఇటు మంచి రెండూ ఉంటాయి. దురదృష్టవ శాతు మన వాళ్ళు చెడుకి అటృఆక్ట్ అవుతూ..మంచిని దూరం పెడుతున్నారు.
ఇక రీసెంట్ గా సమంత ఐటెం సాంగ్ లో ఓ స్టిల్ పై కొందరు మీమ్స్ చేసారు. ఇక అందులో ఆమె ను బ్రహ్మానందం చేసిన స్టిల్ కాపి కొట్టిందంటూ ఫన్నీగా రాసుకొచ్చారు. ఇది ఆ కంట ఈ కంట పడుతూ చివరికి బ్రహ్మానందం కంట పడింది. ఇక ఆయన తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. రీసెంట్ గా అటెండ్ అయిన ఓ షో లో ఆయన మాట్లాడుతూ తన మీద వచ్చిన కొన్ని మీమ్స్‌ను చూపించారు. ఊ అంటావా అనే పాటకు సమంత వేసిన స్టెప్పులు బ్రహ్మానందం నుంచి కాపీ కొట్టారంటూ ఓ మీమ్ వచ్చింది. దానిపై బ్రహ్మానందం రియాక్ట్ అవుతూ.. ..” నేను ఎప్పుడో పాతికేళ్ల క్రితం అలా అంటే.. ఇప్పుడు సమంత కాపీ కొట్టిందని అనడం ఎంత దుర్మార్గం”.. అంటారు బ్రహ్మానందం. సేమ్ గానే ఉందండి అని ప్రదీప్ అంటే.. నేను అలా లేనులే అని బ్రహ్మానందం కౌంటర్లు వేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.