Moviesసమంత పాడైన ఓ సెకండ్‌ హ్యాండ్‌ ఐటెం.. సంచలనంగా మారిన సమంత...

సమంత పాడైన ఓ సెకండ్‌ హ్యాండ్‌ ఐటెం.. సంచలనంగా మారిన సమంత విడాకుల వ్యవహారం..!!

ప్రస్తుత సమాజంలో భార్య భర్తల బంధం అంటే ఓ ఫ్యాషన్ అయిపోయింది. నేటి కాలం యువత ఎలా మారిపోయిందంటే ..త్వరగా లవ్ చేసుకోవడం..అంతే త్వరాగా పెళ్లి చేసుకోవడం..
పెద్దలు ఒప్పుకుంటే సరి..లేదంటే ఉంటారుగా ఫ్రెండ్స్ వాళ్లు తీసుకుపోయి ఎలాగొలా పెళ్లి చేస్తారు. ఆ తరువాత మీ కర్మ కి మీరే బాధ్యులు. ఇక యంగ్ బ్లడ్ ఊరుకుంటుందా పెళ్లి తరువాత మ్యాటర్ ఫినిష్ చేసి.. కొంత కాలానికి మా మధ్య బాండింగ్ కుదరట్లేదు.. మనస్పర్ధలు వస్తున్నాయి..తొక్క తోట కూర కట్ట అంటూ ఏవేవో సాకులు చెప్పి విడిపోవడానికే ప్రయత్నిస్తారు కానీ.. తప్పు ఎవరిది అయితే ఏం మనమిద్దరం ఒక్కటెగా నెక్స్ట్ టైం అలా చేయకు అంటూ తప్పులను ఇద్దరు భార్య భర్తలు సరిదిద్దుకుంటే అసలు ఈ విడాకుల గోలా ఎందుకు. లైఫ్ లో ఏదైన ఒక్క పని చేసే ముందు ఆలోచిస్తే ఇలాంటి బాధలు పడాల్సిన పని ఉండదు కదా..!!

ఇక ముఖ్యంగా ఈ విడాకుల గోల సినిమారంగంలో భారీ సంఖ్యలో వినిపిస్తుంటాయి. అప్పుడెప్పుడో స్టార్ హీరోల నుండి..ఇప్పుడు వాళ్ల కొడుకులు..మనవడులు కూడా డైవర్స్ తీసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్ గా ని లుస్తున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం.. డేటింగ్‌లు చేసుకోవడం… పెళ్లి చేసుకోవడం ఎంత కామన్ అయిన విషయమో నేటి కాలంలో విడాకులు తీసుకోవడం కూడా అంతే కామన్ అయిపోయింది. ఈ మధయనే విడాకులు తీసుకుంటున్నాం అంటూ ప్రకటించారు స్టార్ రొమాంటిక్ కపుల్ సమంత-నాగ చైతన్య. విడాకులు తీసుకోవడం వల్ల వీరు ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ ఈ జంట విడిపోతున్నందౌకు వాళ్ల అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. విడాకులు తీసుకుంటున్నం అని అనౌన్స్ చేసి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇంకా కూడా చైతన్య-సమంత కలిపోతే బాగుండూ అని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది అంటారుగా..అలానే పాజిటివ్ కామెంట్స్ ఉన్న చోటే నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి. కొందరు అభిమానులు డివర్స్ ఇష్యూ పై బాధపడుతుంటే.. మరికొంత మంది మాత్రం సమంత ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్‌ సమంతను..’విడాకులు తీసుకొని పాడైన ఓ సెకండ్‌ హ్యాండ్‌ ఐటెం’ అంటూ దారుణంగా కామెంట్ చేసాడు. అంతేకాకుండా జెంటిల్ మ్యాన్ నుంచి అప్పనంగా రూ. 50కోట్లు దోచుకుందంటూ ట్వీట్‌ చేశాడు. దీనికి సమంత రిప్లై ఇవ్వడం షాకింగా అనిపించింది. నిన్ను ఆ దేవుడు చల్లగా దీవించుగాక అంటూ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news