సాధారణంగానే ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఉంటాయి. తనలో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నప్పటికీ అవతలి వ్యక్తిలో ఒక్క చెడు గుణం ఉన్నా మనిషి సహించలేడు. అది మనిషికి ఉండే సహజ లక్షణం. తాను ఎన్ని తప్పులు చేసినా పరవాలేదు… అవతల వ్యక్తి మాత్రం ఒక తప్పు చేసిన సహించలేని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే భార్య విషయంలోనూ పురుషుడు ఇలాగే ప్రవర్తిస్తుంటాడు. ముఖ్యంగా భార్యకు ఉండే మూడు అలవాట్లను భర్త ఎప్పటికీ సహించలేడు అట.
మరి స్త్రీ లలో ఉండే ఆ మూడు అలవాట్లు ఏమిటి ? ఆచార్య చాణక్య స్త్రీల గురించి ఏం ? చెప్పారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఏ పురుషుడు అయినా కూడా తన భార్య తనతో కాకుండా పరాయి పురుషుడితో చనువుగా మాట్లాడితే భర్త తట్టుకోలేడు. తన భార్య పరాయి పురుషులతో చనువుగా ఉన్నా… మాట్లాడినా… భర్తకు కోపం వచ్చేస్తుంది అట. భర్త మనసులో ఎలాంటి తప్పుడు ఆలోచన లేకపోయినా కూడా తన భార్య మాత్రం మరొక మగవాడితో మాట్లాడితే ఎందుకోగాని ? సహించ లేని మనస్తత్వం భర్తకు ఉంటుందట.
ఇక త్వరలోనే మరో అలవాటు ఏంటంటే ? కొంతమంది మహిళలు చీటికీమాటికీ ఎప్పుడు పడితే అప్పుడు కోప్పడుతూ ఉంటారు. ఇది భర్తకు ఏమాత్రం నచ్చదట. వారి కోపం పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయినప్పుడు భర్త ఏమనుకుంటాడో అన్నది కూడా ఆలోచించకుండా స్త్రీలు తమ కోపాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పాడు చాణక్యుడు. దీనిని ఏ భర్త సహించలేడు.
స్త్రీలు.. మోసం చేయడాన్ని ఏ పురుషుడూ సహించలేడట. మోసం చేయడం అనేది చాలా చెడ్డ గుణంగా చూస్తారు. అయితే ఈ మోసం చేయడం అనేది స్త్రీలలోనే ఎక్కువుగా కనిపిస్తుందని చాణక్యుడు చెప్పాడు.