తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 ముగిసింది. విన్నర్‌గా ఖమ్మంకు చెందిన ఏబీఎన్ మాజీ రిపోర్టర్ సన్నీ నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ షో సిరి-షణ్నూ రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరం బెస్ట్‌ఫ్రెండ్స్ అని పైకి చెప్పుకున్నా కూడా లోపల వీరి క్లోజ్‌నెస్ అనేది ఆడియెన్స్‌కు అంతగా రుచించలేదు. వీరు కావాలనే అంత ఓవర్ చేస్తున్నారన్నది ప్రేక్షకులకు అనిపించింది.
విచిత్రం ఏంటంటే షణ్నూకు సిరికి బయట విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే వీరు లోపలకు వచ్చాక మాత్రం నెగిటివిటీ పెరిగిపోయింది. ఈ ఒక్క కారణంతోనే రేసులో ముందు నుంచి ముందు ఉన్న షణ్ను టైటిల్ చేజార్చుకున్నాడు అన్న కామెంట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక గ్రాండ్ ఫినాలే తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చిన సిరి తనపై వస్తోన్న నెగిటివ్ కామెంట్స్‌కు, షణ్నూతో తనకు ఉన్న రిలేషన్ గురించి మాట్లాడింది. తాను బయటకు వచ్చిన వెంటనే యూట్యూబ్‌లో షణ్నూతో ఉన్న థమ్‌నైల్స్, వీడియోలు, తమ ఇద్దరి గురించి వస్తోన్న పుకార్లు చూసి షాక్ అయ్యానని చెప్పింది. షణ్నూ బయట కూడా మంచి ఫ్రెండ్ అని చెప్పింది.
తాము హౌస్ లోపల ఎంత నిజాయితీగా ఉన్నామో.. బయటకు వచ్చాక కూడా అలాగే ఉంటామని చెప్పింది. హౌస్‌లోపల షణ్నూ తనను చాలా మోటివేట్ చేసేవాడని.. అయితే తాము లోపల హగ్ చేసుకోవడం జనాలు రిసీవ్ చేసుకోలేదని తనకు ఇప్పుడు అర్థమైందని సిరి చెప్పింది. ఇక మా ఇద్దరి పర్సనల్ లైఫ్ గురించి మాకు క్లారిటీ ఉందని చెప్పింది.
ఇక ప్రియుడు శ్రీహాన్‌తో పెళ్లి గురించి మాట్లాడుతూ.. అతడు ఎప్పుడు అంటే అప్పుడే మా పెళ్లి అని.. సినిమా ఆఫర్లు వస్తే వాటిని చేస్తూనే పర్సనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేస్తానని చెప్పింది.