ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం పుష్ప ది రైజ్. స్కై రేంజ్ అంచనాలతో శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. రెండు భాగాలుగా భారీ రేంజ్లో ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ముందే ప్రకటించిన సుకుమార్.. అందులో తొలి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో ప్రేక్షకుల ముందుంచారు. దీంతో పుష్ప ప్రీమియర్ షోస్ భారీ ఆదరణ దక్కించుకున్నాయి.
అభిమానులో అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సుకుమార్ సినిమాలోని ప్రతి సీన్ ను అధ్భుతంగా తెరకెక్కించాడు. స్మగ్లర్‌గా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. బన్నీ కెరీర్లో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ అయిన పుష్ప సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా స్లో గా సాగినప్పటికి బన్నీ పర్ ఫామెన్స్ తో అదరగిట్టేసారు. ఇక సమంత ,రష్మిక అందం సినిమాకు మంచి ప్లస్ గా నిలిచాయి.
శుక్రవారం రిలీజైన ఈ సినిమా ల్‘పుష్ప’ లో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. బన్నీ, రష్మిక మధ్య వచ్చే కొన్ని సీన్స్ మరీ ఎబెట్టుగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ కి అవి ఇబ్బందికరంగా ఉన్నాయని సినీ విమర్శకులు తేల్చి చెప్పారు. శ్రీవల్లి, పుష్పరాజ్ వ్యాన్‌లో రొమాన్స్ చేసుకుంటారు. అలా అనుకోకుండా పుష్పరాజ్ శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్‌ను తాకినట్లు చూపిస్తారు. అది ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఇబ్బందిగా మారింది.
ఇది కచ్చితంగా సుకుమార్ మార్క్ కాదు. సుకుమార్ ఇలా ఆలోచించడు అనుకున్నవాళ్లకు ఆ సన్నివేశం పంటికింద రాయిలా తగులుతుంది. దీన్ని చూసిన ఫ్యామిలీ ఆడియన్స్.. సుకుమార్ మార్క్‌లో ఇది ఊహించలేదని తొలిరోజు రివ్యూలో చెప్పారు. దీన్ని దృష్టిలోకి తీసుకున్న సుక్కూ.. ఆ సీన్‌ను తీయేలని నిర్ణయించుకున్నారట. ఆదివారం నుంచి సీన్ లేకుండా సినిమా ప్రదర్శించబడుతుందట. మొత్తానికి సుకుమార్ మంచి నిర్ణయమె తీసుకున్నారు అంటున్నారు ఆడియన్స్.