Moviesఛాన్స్ పేరుతో బెడ్‌పైకి లాగిన టాలీవుడ్ డైరెక్ట‌ర్‌.. యాంక‌ర్ వ‌ర్షిణి బిగ్...

ఛాన్స్ పేరుతో బెడ్‌పైకి లాగిన టాలీవుడ్ డైరెక్ట‌ర్‌.. యాంక‌ర్ వ‌ర్షిణి బిగ్ బాంబ్‌..!

యాంకర్ వర్షిని పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర‌పై తిరుగులేని హాట్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న వ‌ర్షిణి ఢీ షోతో బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ షోలో ర‌ష్మీతో క‌లిసి వ‌ర్షిణి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ షోకు మ‌రింత గ్లామ‌ర్ డోస్ తీసుకు రావ‌డంలో వ‌ర్షిణి బాగా హెల్ఫ్ అయ్యింది. ఇక జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆదికి జోడీగా వ‌ర్షిణి ఎంతో సంద‌డి చేసింది. ఆ త‌ర్వాత ఢీ షో నుంచి త‌ప్పుకున్న ఆమె మా టీవీలో ప్ర‌సారం అయ్యే కామెడీ స్టార్స్‌లో యాంక‌ర్‌గా కొన్ని రోజులు సంద‌డి చేసింది.

వ‌ర్షిణి బుల్లితెర‌పై మాత్ర‌మే కాకుండా వెండితెర‌పై కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది. ఇక వ‌ర్షిణి ఈ స్థాయికి రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డింది అట‌. ఈ విష‌యాన్ని ఆమె ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. తాను బుల్లితెర‌కు రావాల‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని.. అయితే తాను మోడ‌లింగ్ చేసేట‌ప్పుడు అవ‌కాశాలే త‌న వెంట ప‌డ్డాయ‌ని ఆమె చెప్పింది.

ఇక తాను ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్న‌ట్టు కూడా వ‌ర్షిణి చెప్పింది. టాలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్ట‌ర్ ఓ సినిమాలో ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పార‌ని.. అగ్రిమెంట్ సైన్ చేసేందుకు ఇంటికి రావాల‌ని కోర‌డంతో తాను ఆయ‌న ఇంటికి వెళ్లాన‌ని చెప్పింది. అయితే స‌ద‌రు డైరెక్ట‌ర్ త‌న‌తో అస‌భ్యంగా బిహేవ్ చేయ‌డంతో పాటు చేయి ప‌ట్టుకుని బెడ్ మీద‌కు లాగ‌బోయాడ‌ని వ‌ర్షిణి చెప్పింది.

దాంతో తాను ఆ డైరెక్ట‌ర్ చెంప ప‌గ‌ల కొట్టాన‌ని వ‌ర్షిణి తెలిపింది. అయితే ఆ డైరెక్ట‌ర్ పేరు మాత్రం ఆమె చెప్ప‌లేదు. ఇక హాట్ యాంక‌ర్‌గా ఉన్న వ‌ర్షిణి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ హాట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. పొట్టి దుస్తుల్లో కూడా పోజులు ఇస్తూ కుర్ర‌కారుతో పాటు మేక‌ర్స్ చూపులు త‌న మీద ఉండేలా చేసుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news