ఇప్పుడు ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒక్కటే పాట వినపడుతుంది. అదే ..”ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ”..సాంగ్. పుషప సినిమాలో ఐటెం సాంగ్ గా రిలీజ్ అయిన ఈ పాట నెట్టింట దుమ్మురేపుతుంది. సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి ఒక స్పెషల్ సాంగ్‌లో సమంత స్టెప్పులేస్తుందని తెలియగానే ఫ్యాన్స్ ఎంతో షాకయ్యారు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయని సమంత.. పుష్పలో స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పడంతో ఇది ఎలా ఉండబోతుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ఆడిపాడిన ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే ఐటమ్ సాంగ్ లిరికల్ సాంగ్‌ను శుక్రవారం రిలీజ్ చేసింది చిత్ర బ్రందం. ఇక ఈ సాంగ్ మాస్ బీట్ తో అందరిని అలరిస్తుంది. మత్తు వాయిస్‌తో సాగే ఈ పాటలో సమంత తన మాస్ స్టెప్పులతో అదరగొట్టిన్నట్లు తెలుస్తుంది. సామ్ కాస్ట్యూమ్, స్టైల్, లుకింగ్ అన్నీ పాటకు పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి మార్మోగించడంతో సాంగ్ బ్లాక్బాస్టర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు.
అయితే ఈ ఊ అంటావా మామ.. ఊఊ అంటావా పాట కు మెయిన్ ప్లస్ పాయింట్ సింగర్ వాయిస్..పాటతో మత్తెక్కించే వాయిస్ తో భళే పాడింది. దీంతో ఈ పాట పాడిన సింగర్ ఎవరా అంటూ ఆరా తీస్తున్నారు. ఈ పాట పాడింది ఇంద్రావతి చౌహాన్. ఈమె తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీకి చెల్లెలు అవుతుంది.
ఈమె ఇది వరకే జార్జి రెడ్డి సినిమాలో ఒక పాట పాడింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో పాట పాడే ఛాన్స్ కొట్టేసిన ఇంద్రావతి చౌహాన్.. మత్తెక్కించే వాయిస్‌తో కుర్ర కారు మతి పోగొట్టేసింది.