దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోనే ఇద్దరు క్రేజీ యంగ్‌స్టర్స్ అయిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి తెరపై స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు మామూలుగా లేవు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ ఇప్పటికే భారీ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకి, ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో రాబోయే 25 రోజులు పూర్తిగా ప్రమోషన్ కోసమే కేటాయించారు దర్శకుడు రాజమౌళి. అందులో భాగంగా సినిమా విడుదలకు ముందు మూడు ప్రధానమైన ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
అందులో మొదటిది డిసెంబర్ 15న వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. కాగా రెండోది హిందీ ఈవెంట్…అలాగే 25న ముంబైలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో భారీగా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకోసం ఏకంగా రాజమౌళి 3000మంది అభిమానులను స్పెషల్ ట్రన్ లో ముంబై తీసుకెళ్లనున్నారట. ఇక మూడోది సినిమా విడుదలకు వారం రోజుల ముందు అంటేఅ జనవరి 1 లేదా 2వ తేదీల్లో హైదరాబాద్ లో అత్యంత వైభవంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూడు ఈవెంట్స్ తర్వాత సినిమా విడుదల కానుంది. దీంతో సినిమా కి పబ్లిసిటీ బాగా వచ్చేస్తుందని రాజమౌళి స్కెచ్ వేసారు.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన ఐదు రోజుల వ్యవధిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ భారీ అంచనాల మధ్య రానుంది. 6 రోజుల గ్యాప్ లో మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ కూడా వచ్చేస్తుంది. తమిళంలో అజిత్ వాలిమైతో పాటు ప్రతి భాషలో ఇదే తరహా కాంపిటీషన్ కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు బాహుబలి రికార్డులను కొట్టే స్కోప్ ఆర్ఆర్ఆర్ కి ఉంటుందా అనే సందేహాలు తెస్తుంది.