సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల కులాల గురించి, వారి ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. వారి అభిమానులకే మాత్రమే కాకుండా.. సినీ అభిమానులకు కూడా కులాల గురించి తెలుసుకోవాలన్న ఇంట్రస్ట్ ఎక్కువే. ఇండస్ట్రీలో ఎక్కువుగా కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ వర్గాలకు చెందిన వారే ఎక్కువుగా ఉన్నారు. ఇందులోనూ ప్రధానంగా ఇండస్ట్రీలో కమ్మ, కాపులే ఎక్కువ. ఇండస్ట్రీలో కాపు కులానికి చెందిన స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.
కైకాల సత్యనారాయణ :
ఇండస్ట్రీలో దశాబ్దాలుగా ఎన్నో పాత్రల్లో నటించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు.
మెగాస్టార్ చిరు ఫ్యామిలీ:
ఇప్పుడు టాలీవుడ్ అంటేనే సగం మెగాస్టార్ ఫ్యామిలీదే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచే ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ ఉన్నారు. మెగాస్టార్ చిరు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇలా ఈ ఫ్యామిలీ నుంచే ఏకంగా 11 మంది హీరోలు ఉన్నారు. వీరంతా గోదావరి జిల్లా కాపులు.
రియల్ స్టార్ శ్రీహరి:
ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన రియల్ స్టార్ శ్రీహరి కూడా కాపు వర్గానికి చెందిన వారే. ఆయన భార్య డిస్కోశాంతి
ఎమ్మెస్ నారాయణ:
ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ నారాయణ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కాపులు. ఆయన స్వస్థలం నిడమర్రు.
దాసరి నారాయణరావు:
దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఇలా ఎన్నో రకాల రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దాసరి కూడా కాపు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
శేఖర్ కమ్ముల:
ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా కాపు వర్గానికి చెందిన వారు.
కోడి రామకృష్ణ:
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ కూడా దాసరి శిష్యుడు. ఆయన కూడా కాపు వర్గానికి చెందిన వారే. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
వీరితో పాటు నటి హేమ, దర్శకులు వివి వినాయక్, మెహర్ రమేష్, అల్లు అరవింద్ ఇలా చాలా మంది కాపు వర్గం వారు ఇండస్ట్రీలో ఉన్నారు.