మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత 2017లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా పదేళ్లు సినిమాలకు దూరంగా ఉండి… ఆ తర్వాత సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా మునుపటి ఎనర్జీ అయితే ఉండదు. ప్రేక్షకులు కూడా ఆ హీరోలను చాలావరకూ మర్చిపోతారు. మరోవైపు యువతరం ప్రేక్షకులు యువ హీరోలకు అభిమానులు మారిపోతారు. అయితే చిరు విషయంలో మాత్రం అవన్నీ పటాపంచలు అయిపోయాయి. ఖైదీ నెంబర్ 150 సినిమా అప్పటికే కోలీవుడ్ లో విజయ్ హీరోగా కత్తి పేరుతో తెరకెక్కే హిట్ అయింది. ఆ సినిమాను చిరు రీ ఎంట్రీ కోసం వాడుకున్నారు. అయినా కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
పైగా బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ,శర్వానంద్ శతమానం భవతి లాంటి సినిమాల మధ్యలో వచ్చి కూడా ఖైదీ నెంబర్150 ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే చిరంజీవి తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అలనాటి మేటి నటి మేనకతో మొదలుపెడితే మాధవి – రాధిక – భానుప్రియ – విజయశాంతి – రాధ – ఆర్తి అగర్వాల్ – సోనాలి బింద్రే – రంభ – రోజా – రమ్యకృష్ణ – నయనతార – తమన్నా ఇలా చాలా మంది హీరోయిన్లతో చిరు ఆడి పాడారు. ఈ హీరోయిన్లు ఎవరు కూడా చిరును డామినేట్ చేసే పరిస్థితి లేదట.
డ్యాన్సుల్లో గాని… డైలాగుల్లో కానీ ఎప్పుడు కూడా హీరోయిన్ల కంటే చిరుయే చాలా స్పీడ్‌గా ఉండేవారట. అయితే రాధ మాత్రం ఒక్కోసారి తననే డామినేట్ చేసేలా ఉండేదని.. చిరుయే స్వయంగా చెప్పారు. ఒక సీన్ డైరెక్టర్ చెప్పిన వెంటనే కేవలం రెండే రెండు నిమిషాల్లో ఆమె రిహార్సల్ చేసి షాట్ కు రెడీ అయిపోయేదట. ఆమె ఎనర్జీ కానీ, స్పీడ్ గాని తనను ఎంతో ఆకట్టుకునేవి అట.
సెట్లో ఆమె ఉందంటే తనకు కచ్చితంగా లోపల టెన్షన్ ఉండేదని చిరు చెప్పారు. ఒక్కో షాట్‌కు రిహార్సల్‌కు తనకే పది నిమిషాలు టైం పట్టేది అని… కానీ రాధ మాత్రం రెండు నిమిషాలకే షాట్ కు రెడీ అయిపోయి ఉండేదని చెప్పారు. తర్వాత అలాంటి టెన్షన్ తనకు ఏ హీరోయిన్ విషయంలో రాలేదని చిరు నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. మొత్తానికి చిరునే టెన్షన్ పెట్టింది అంటే రాధ మామూలుది కాదనే అనుకోవాలి.