Moviesచిరంజీవి చేసిన మోసం... చెంప చెల్లుమ‌నిపించిన రాధిక‌..!

చిరంజీవి చేసిన మోసం… చెంప చెల్లుమ‌నిపించిన రాధిక‌..!

పునాదిరాళ్లు సినిమాతో పునాది వేసుకున్న చిరంజీవి స్వ‌యంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చే మెగాస్టార్ అయ్యారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభ‌న్‌బాబు, కృష్ణ లాంటి యోధానుయోధులు ఇండ‌స్ట్రీని ఏలుతున్న టైంలో సినిమాల్లోకి వ‌చ్చిన చిరంజీవి వారిని ఎదుర్కొని మెగాస్టార్ అయ్యారు. పదేళ్ల పాటు చిరంజీవి ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నా కూడా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి రు. 100 కోట్లు కొల్ల‌గొట్టి త‌న స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసుకున్నారు. ప‌దేళ్లు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నా కూడా చిరులో జోష్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం 65 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో కూడా చిరు కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తూ వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళుతున్నారు.

చిరంజీవికి జోడీగా అప్ప‌ట్లో రాధిక‌, సుమ‌ల‌త‌, విజ‌య‌శాంతి, సుహాసిని, భానుప్రియ లాంటి హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించాడు. వీరింద‌రిలోనూ రాధిక‌తో చిరంజీవిది ప్ర‌త్యేక‌మైన బంధం. చిరంజీవి – రాధిక క‌లిసి ఎక్కువ సినిమాల్లో న‌టించారు. వీర‌ద్ద‌రి సినిమాల‌కు అప్ప‌ట్లో తెలుగునాట విప‌ర‌త‌మైన క్రేజ్ ఉండేది. రాధిక చిరంజీవితో పోటీప‌డి మ‌రీ డ్యాన్సులు వేసేది. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన తొలి సినిమా ప్రియ‌. అయితే ముందుగా విడుద‌ల అయ్యింది మాత్రం న్యాయం కావాలి.

1981లో రిలీజ్ అయిన ఈ సినిమా నిర్మాత క్రాంతికుమార్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు కోదండ రామిరెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో చిరంజీవికి – రాధిక‌కు మ‌ధ్య కొన్ని మ‌ర్చిపోలేని సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. సినిమాలో చిరంజీవిది నెగిటివ్ రోల్‌. రాధిక‌ను ప్రేమించి శారీర‌కంగా లోబ‌ర‌చుకుని.. త‌ర్వాత మోసం చేస్తాడు. అప్పుడు రాధిక చిరుతో ఎమోష‌న‌ల్ డైలాగులు చెప్ప‌డంతో పాటు న‌న్ను ఎందుకు మోసం చేశావు అంటూ చెంప మీద కొట్టే సీన్ ఉంటుంది.

ఈ సీన్ కోసం రాధిక ప‌దే ప‌దే టేకులు తీసుకుంద‌ట‌. అయితే చిరంజీవి గ‌ట్టిగా త‌న చెంప‌మీద కొట్ట‌మ‌ని చెప్ప‌డంతో రాధిక క్యారెక్ట‌ర్లో లీన‌మై చిరు చెంప‌ను ఒక్క‌సారిగా చెల్లుమ‌నిపించింద‌ట‌. దీంతో చిరు చెంప ఎర్ర‌గా వాచిపోయింద‌ట‌. ఆ త‌ర్వాత చిరు ఇలాంటివి అన్నీ కామ‌న్ అని.. అవేమి ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌. ఆ ఒక్క షాట్‌తోనే కోదండ రామిరెడ్డి ఆ సీన్ బాగా వ‌చ్చింద‌ని మెచ్చుకున్నార‌ట‌. ఆ త‌ర్వాత చిరంజీవి ద‌ర్శ‌కుడితో ఇలాంటి షాట్ మ‌రొక‌టి ఉందా ? అని అడిగాడ‌ట‌. దీంతో అక్క‌డున్న వారంద‌రూ ఒక్క‌సారిగా న‌వ్వేశార‌ట‌.

ఇక అప్ప‌టి నుంచి చిరు – రాధిక కాంబినేష‌న్లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా వీరి మ‌ధ్య స్నేహం అలాగే కంటిన్యూ అవుతుంది. చిరు హీరోయిన్ల అంద‌రిలోనూ రాధిక‌తో మంచి స్నేహం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news