మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వస్తోన్న సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇటీవల వచ్చిన సిద్ధా సాగా పేరుతో చెర్రీ క్యారెక్టర్ టీజర్ కూడా అదిరిపోయింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
కామ్రేడ్ సిద్ధగా రామ్‌చరణ్ గెటప్, స్టిల్స్, లుక్స్ క్యారెక్టర్‌పై అంచనాలు భారీగా పెంచేశాయి. ధర్మస్థలికి ఆపద వస్తే అది జయించడానికి అమ్మోరు తల్లి మాలో అవహించి ముందుకు పంపుతుంది అని చెర్రీ చెప్పిన డైలాగ్ చూస్తే క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇక టీజర్లో చివర్లో వచ్చిన చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే వెనక వచ్చిన చిరుత పులి కాపలా కాస్తూ ఉంటుంది. అలాగే చిరు తనయుడు చరణ్ నీళ్లు తాగుతుంటే.. చిరు కాపలా కాసే షాట్ చంపేసింది.
తాజాగా ఈ సినిమా గురించి కొరటాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆచార్య సినిమా ధర్మం గురించి చెపుతుంది అని.. ఈ సినిమా కథ ధర్మస్థలి చుట్టూ తిరుగుతుంది అని.. చెర్రీ పోషించిన సిద్ధ పాత్ర ధర్మానికి ప్రతిరూపం అని కొరటాల చెప్పారు. ఇక చెర్రీ సీన్స్ అన్ని కూడా ఆర్గానిక్‌గా ఉంటాయని చెప్పారు. ఇక మెగాస్టార్ చిరు ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్నీ ఉండేలా చిరు క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నానని కొరటాల చెప్పారు.
ముందుగా చిరు – చెర్రీలను ఒకే ఫ్రేమ్‌లో చూపించేందుకు తాను చాలా టెన్షన్ పడ్డానని.. ఇక త్వరలోనే ఆచార్య గురించి రెండు అదిరిపోయే న్యూస్ లు ఉంటాయని కొరటాల చెప్పారు. వాటిల్లో ఒకటి చిరు – చెర్రీ కలిసి చేసిన పాట అయితే మరొకటి థియేట్రికల్ ట్రైలర్ అని చెప్పారు. ఇక దేవాదాయ శాఖకు సంబంధించిన కథాంశంతోనే ఆచార్య తెరకెక్కిందని కొరటాల చెప్పారు.