Moviesఅఖండ ' ప్రి రిలీజ్ బిజినెస్‌... బాల‌య్య టార్గెట్ ఇదే..!

అఖండ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… బాల‌య్య టార్గెట్ ఇదే..!

యువరత్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో శ్రీకాంత్ నటించారు. జగపతిబాబు – పూర్ణ – కాల‌కేయ ప్రభాకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ / ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 2:47 గంట‌ల నిడివితో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల కలిపి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగినట్టు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏరియాల వారీగా అఖండ ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం – 11 కోట్లు
సీడెడ్ – 11 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 5.80 కోట్లు
ఈస్ట్ – 3.95 కోట్లు
వెస్ట్ – 3.44 కోట్లు
కృష్ణా – 3.82 కోట్లు
గుంటూరు – 5.48 కోట్లు
నెల్లూరు – 1.89 కోట్లు
—————————————
ఏపీ + తెలంగాణ = 46.38 కోట్లు
—————————————
రెస్టాఫ్ ఇండియా – 4.40 కోట్లు
ఓవ‌ర్సీస్ – 2.47 కోట్లు
——————————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ = 53.25 కోట్లు
———————————————————

బాల‌య్య‌కు ప‌ట్టున్న సీడెడ్‌లో ఈ సినిమా బిజినెస్ రు. 11 కోట్లు జ‌రిగితే.. బాల‌య్య‌కు కాస్త త‌క్కువ మార్కెట్ ఉన్న నైజాంలోనూ ఏకంగా రు. 11 కోట్ల‌కు అమ్ముడు అయ్యింది. ఇక ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే ఏకంగా 1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు వ‌చ్చాయంటున్నారు. మ‌రి రు. 54 కోట్ల టార్గెట్‌తో స్టార్ట్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news