బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పెళ్లి ఇప్పుడు బాలీవుడ్లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే నెల రెండో వారంలో వీరి పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీరి పెళ్లి ఖాయం అని అందరూ చెప్పుకుంటున్నా ఈ జంట మాత్రం దీని గురించి స్పందించడం లేదు. ఇక వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో రాజస్తాన్‌లోని రణతంబోర్లో వీరి పెళ్లి జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ జంట అక్కడ తమ పెళ్లికి భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యే సెలబ్రిటీలు, ప్రముఖుల కోసం ఈ జంట భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందట. ఏకంగా 45 స్టార్ హోటళ్లను బుక్ చేశారట. ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న 45 హోటళ్లను కూడా వీరు తమ పెళ్లి అతిథుల కోసం బుక్ చేశారట. అక్కడ భారతీయ, పాశ్యాత్య వంటకాలతో కళ్లు జిగేల్ మనే రేంజ్లో ఏర్పాట్లు చేస్తున్నారట.
ఇక ఈ గెస్టుల లిస్టులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ కూడా ఉన్నాడట. కత్రినా, విక్కీ సంయుక్తంగా సల్మాన్‌ఖాన్‌ను ఆహ్వానించారని.. తన మాజీ ప్రియురాలు పెళ్లికి సల్మాన్ కూడా హాజరు కావొచ్చని అంటున్నారు. బ్రేకప్ తర్వాత కూడా కత్రినాతో సల్మాన్ పలు సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య బ్రేకప్ తర్వాత కూడా సంబంధాలు ఉన్నాయి.
ఇక కత్రీనా మరో మాజీ ప్రియుడు రణబీర్ కపూర్‌కు కూడా ఆహ్వానం అందిందా లేదా ? అని సోషల్ మీడియాలో ఒక్కటే చర్చలు నడుస్తున్నాయి. బ్రేకప్ తర్వాత కూడా వీరిద్దరు కలిసి ఓ సినిమా పూర్తి చేశారు. గతాన్ని మర్చిపోయి ఈ ఇద్దరు మాజీ ప్రియులు కూడా కత్రినా పెళ్లికి వస్తే.. ఇద్దరు మాజీ ప్రియుళ్ల సమక్షంలో కత్రినా పెళ్లి జరగడం పెద్ద ట్విస్టే అవుతుంది.