Moviesతన పెళ్లి బయట ప్రపంచానికి తెలియకూడదు అనుకున్న విజయ..ఎందుకో తెలుసా..?

తన పెళ్లి బయట ప్రపంచానికి తెలియకూడదు అనుకున్న విజయ..ఎందుకో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో డేటింగ్ లు, ఎఫైర్ లు చాలా కామాన్ గా కనిపిస్తుంటాయి. చాలామంది నటీనటులు కొన్ని కొన్ని సందర్భాలలో ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. ఇక తమ పెళ్లి మ్యాటర్ ని ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచిన హీరోయిన్ లు చాలామందే ఉన్నారు. వారు ఎవరిని వివాహం చేసుకున్నారో కూడా ఇంట్లో వాళ్లకు చెప్పకుండ ఉన్న స్టార్స్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉండడం గమనార్హం. కానీ, ఆ ముద్దుగుమ్మలు ఎంత దాచిన ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా బయట పడడంతో.. కొన్ని రోజులు మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తారు. ఇక ఇలా రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిలో సీనియర్ నటి కె.ఆర్.విజయ కూడా ఒకరు.

ఇక ఈమె అసలు పేరు దైవ నాయకి . ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బడా స్టార్స్ తో కూడా నటించి ఎంతో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ ఒకానోక సమయంలో సినీ ఇండస్ట్రీని ఏలేసిందనే చెప్పాలి. దర్శక నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా చలామణి అయిన విజయ.. ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
కేవలం 17 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే 1966లో ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ పాండవీయం అనే సినిమాలో నటించి.. సినీ ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంది.

 

ఇక అదే టైంలో విజయకి తమిళ నిర్మాత అలాగే ఫైనాన్షియర్ సుదర్శన్ వేలాయుధమ్పరిచయమవుతారు. ఇక ఆ పరిచయం అలా అలా పెరిగి స్నేహంగా మారి అది కాస్త లాస్ట కి ప్రేమగా మారింది. వీరి ప్రేమ క్రమంగా బలపడడంతో..ఫైన ల్ గా పెళ్లి వరకు దారి తీసింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా రహస్యంగా ఆ నిర్మాతతో వివాహం చేసుకుంది విజయ. ఆ విషయాని ఇంట్లో కానీ బయట గానీ ఎక్కడ తెలియకుండా జాగ్రత్త పడింది. ఎందుకంటే ఈమె ఆ నిర్మాతను పెళ్లి చేసుకున్న సమయానికి మేజర్ కాలేదు.

సో.. మైనర్ కావడం వల్లే తన పెళ్లి విషయాన్ని ఎక్కడా చెప్పకుండా జాగ్రత్తగా ఉన్నారట. అయితే విజయ గర్భిణిగా ఉన్నప్పుడు సుదర్శన్ వేలాయుధమ్ తనను పర్యటన కోసమని ఫ్లైట్లో తీసుకు వెళ్ళాడు. ఇక అప్పుడు ఒక వ్యక్తి వీరి ఫోటోలను తీయడంతో ఆ ఫోటోలు పత్రికలో రావడంతో ఈ విషయం బయటపడ్డింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news