NewsOmicron Virus: ఫస్ట్ టైం వైర‌స్‌ను గుర్తించింది ఎవ‌రో తెలుసా..?

Omicron Virus: ఫస్ట్ టైం వైర‌స్‌ను గుర్తించింది ఎవ‌రో తెలుసా..?

దాదాపు రెండేళ్లు మనలని అల్లాడించిన మహమ్మారి కరోనా వైరస్ తగ్గు ముఖం పడుతుందిలే అనుకుంటున్న క్రమంలో రూపం మారుస్తూ మానవాళ్లి పై మరోసారి విరుచుకుపడుతుంది ఈ కొత్త రకం కరోనా.. “ఒమిక్రాన్‌ వైరస్‌”. దీంతో ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా మ‌రోసారి భ‌యం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుండి బయటపడుతున్నం అనీ ఊపిరి పీల్చుకుంటున్నాం అనుకునేసరికి మరో బిగ్ బాంబ్ పేల్చింది ప్రపంచ ఆరోగ్య సంస్ధ. క‌రోనా కొత్త వేరియంట్ గుతించబడిన ఈ ఒమిక్రాన్ వైరస్…మునుపటి రెండు వైరస్ లు కంటే చాలా డేంజర్ అంటూ WHOహెచ్చరికలు జారీ చేసింది.

న‌వంబ‌ర్ 25న కొత్త వేరియంట్ గురించి సౌతాఫ్రికా సైంటిస్టులు ప్ర‌పంచానికి తెలియ‌జేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వ్యాప్తిచెందుతున్న ఈ వేరియంట్‌ను ‘ఆందోళనకరమైన వేరియంట్’గా వర్గీకరించింది. భ్.1.1.529 జినోమ్ కోడ్‌ ఉన్న ఈ వేరియంట్‌కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో వ్యాక్సిన్‌లు ఈ కొత్త వేరియంట్‌పై తక్కువ ప్రభావవంతంగా పనిచేయవచ్చని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఒమిక్రాన్ వైర‌స్‌ను మొద‌ట‌గా గుర్తించింది సౌత్ ఆఫ్రికా మెడిక‌ల్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలిగా ఉన్నా డాక్ట‌ర్ ఆంగెలిక్యూ కొయెట్జీ. కొన్ని రోజుల క్రితం ఓ 30 మంది వ్య‌క్తుల‌కు క‌రోనా సోకింద‌ట‌. టెస్ట్లు చేస్తే అది అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఏ వేరియంట్‌తోనూ స‌రిపోల‌లేద‌ట‌. దీంతో త‌న‌కు అనుమానం వ‌చ్చి ఆ వైర‌స్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించిందట. ల్యాబ్‌లో ఆ వైర‌స్‌ను ప‌రీక్షించిన సైంటిస్టులు.. అది కొత్త వేరియంట్ అని.. క‌రోనా మ్యూటేష‌న్ చెంద‌గా ఏర్ప‌డిన కొత్త వేరియంట్ అని స్ప‌ష్టం చేశారు. B.1.1.529 వేరియంట్‌కు సంబంధించి ఎలాంటి అసాధారణ లక్షణాలను గుర్తించలేదని దక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) తెలిపింది. కరోనా బారిన పడే ప్రమాదం ఉన్న సమూహాలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు వేయడం ద్వారా కొత్త వేరియంట్ ఇన్‌ఫెక్షన్‌ను కట్టడి చేయవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news