యువరత్న నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ సినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. గత 21 నెలలుగా ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోన్న అఖండ ప్రి రిలీజ్ వేడుక శనివారం రాత్రి శిల్పాకళావేదికలో అంగరంగ వైభవంగా జరిగింది.
అల్లు అర్జున్, రాజమౌళి ఇద్దరూ కూడా స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఈ వేదికపై అల్లు అర్జున్, రాజమౌళి ఇద్దరి స్పీచ్‌లు హైలెట్ అవ్వడంతో పాటు కేవలం నందమూరి అభిమానుల్లోనే కాకుండా.. తెలుగు సినీ ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహం నింపాయి. కరోనా తర్వాత వస్తోన్న పెద్ద సినిమా కావడంతో అఖండ రిజల్ట్ కోసమే అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోన్నారు.
ఇక రాజమౌళి మాట్లాడుతూ అఖండతో ఈ ఆడిటోరియానికే కాదు.. సినిమా ఇండస్ట్రీకే మాంచి ఊపు తెచ్చిన బోయపాటి గారికి ధన్యవాదాలు అని చెప్పారు. డిసెంబర్ 2నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా థియేటర్లలో అరుపులు, కేకలతో సరికొత్త జోష్ ఉండాలని తాను కోరుకుంటున్నట్టు రాజమౌళి చెప్పారు. ఇక బాలయ్య ఓ ఆటంబాంబ్ అని.. ఆ ఆటంబాంబ్‌ను ఎలా ప్రయోగించాలో శ్రీను గారికి మాత్రమే తెలుసు.. ఆ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పాలని రాజమౌళి అన్నారు.
ఇక మీ అందరిలాగానే అఖండ సినిమా తాను థియేటర్లోనే చూడాలని అనుకుంటున్నట్టు రాజమౌళి చెప్పారు. అఖండ సినిమా నుంచి మళ్లీ ఇంటస్ట్రీకి కొత్త ఊపు రావాలని కోరుకుంటున్నానని రాజమౌళి కోరారు.